వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | ఖుల్నా, బంగ్లాదేశ్ | 12 డిసెంబరు 1994
ఎత్తు | 167[1] cమీ. (5 అ. 6 అం.) |
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ |
పాత్ర | ఆల్ రౌండరు |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు |
|
తొలి వన్డే (క్యాప్ 135) | 2021 మార్చి 20 - న్యూజీలాండ్ తో |
చివరి వన్డే | 2023 ఆగస్టు 31 - శ్రీలంక తో |
తొలి T20I (క్యాప్ 63) | 2018 ఫిబ్రవరి 18 - శ్రీలంక తో |
చివరి T20I | 2022 సెప్టెంబరు 1 - శ్రీలంక తో |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2016 | Barisal Bulls |
2017 | కొమిల్లా విక్టోరియన్స్ |
2018–present | Gazi Group Cricketers |
2019 | ఢాకా ప్లాటూన్ |
2022 | Khulna Tigers |
మూలం: Cricinfo, 1 September 2022 |
మహెదీ హసన్ (జననం 1994 డిసెంబరు 12) బంగ్లాదేశ్ క్రికెటరు. అతను ఖుల్నా డివిజన్‌కు, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకూ ఆడుతున్నాడు. [2] 2018 ఫిబ్రవరిలో మహెదీ, బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[3]
2016–17 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో బరిసల్ బుల్స్ తరపున ఆడిన మహెదీ, 2016 నవంబరు 8న తన తొలి ట్వంటీ20 మ్యాచ్ ఆడాడు.[4]
మహెదీ 2018 అక్టోబరులో, 2018–19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో, కొమిల్లా విక్టోరియన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. [5] 2018 నవంబరులో, 2018–19 బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్‌లో సౌత్ జోన్ తరపున బౌలింగ్ చేస్తూ, ఫస్ట్-క్లాస్ క్రికెట్లో తన తొలి ఐదు వికెట్ల పంట సాధించాడు. [6] 2019 ఆగస్టులో, బంగ్లాదేశ్ 2019-20 సీజన్‌కు ముందు శిక్షణా శిబిరంలో చేరిన 35 మంది క్రికెటర్లలో అతను ఒకడు. [7] 2019 నవంబరులో, 2019–20 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఢాకా ప్లాటూన్ కోసం ఆడేందుకు ఎంపికయ్యాడు. [8]
2018 ఫిబ్రవరిలో, శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో మహెదీ ఎంపికయ్యాడు. [9] అతను 2018 ఫిబ్రవరి 18న శ్రీలంకపై బంగ్లాదేశ్ తరపున తన T20I రంగప్రవేశం చేసాడు [10] మళ్లీ 2019-20 బంగ్లాదేశ్ ట్రై-నేషన్ సిరీస్‌లో మొదటి రెండు T20Iల కోసం అతన్ని జట్టులోకి తీసుకున్నారు గానీ అతన్ని ఆడించలేదు. తదుపరి రెండు T20Iల నుండి తొలగించారు. [11] 2019 నవంబరులో, అతను బంగ్లాదేశ్‌లో జరిగే 2019 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఎంపికయ్యాడు. [12] అదే నెలలో, 2019 దక్షిణాసియా క్రీడలలో పురుషుల క్రికెట్ టోర్నమెంట్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికయ్యాడు. [13] బంగ్లాదేశ్ జట్టు, ఫైనల్లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. [14]
2021 జనవరిలో, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే ఇంటర్నేషనల్ (వన్డే) జట్టులో మహెదీని ఎంపిక చేశారు. [15] మరుసటి నెలలో, న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసం కూడా ఎంపికయ్యాడు. [16] అతను బంగ్లాదేశ్ తరపున 2021 మార్చి 20న న్యూజిలాండ్‌పై తన వన్డే రంగప్రవేశం చేశాడు. [17]
2021 సెప్టెంబరులో, అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఎంపికయ్యాడు. [18]