మహేష్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఆర్. మదన్ కుమార్ |
రచన | ఆర్. మదన్ కుమార్ |
స్క్రీన్ ప్లే | ఆర్. మదన్ కుమార్ |
కథ | ఆర్. మదన్ కుమార్ |
నిర్మాత | సురేష్ కొండేటి |
తారాగణం | సందీప్ కిషన్, డింపుల్, జగన్, లివింగ్‌స్టన్ |
ఛాయాగ్రహణం | రాణా |
సంగీతం | గోపి సుందర్ |
నిర్మాణ సంస్థ | ఎస్.కె. పిక్చర్స్ |
విడుదల తేదీ | 20 సెప్టెంబరు 2013 |
భాష | తెలుగు |
మహేష్ 2013లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2013 ఏప్రిల్లో ‘యారుడా మహేశ్’ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో మహేష్ పేరుతో ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్ పై సురేశ్ కొండేటి నిర్మించాడు. సందీప్ కిషన్, డింపుల్, జగన్, లివింగ్‌స్టన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబరు 20, 2013న విడుదలైంది.[1]
శివ (సందీప్ కిషన్), వసంత్ (జగన్) ఇద్దరు మిత్రులు. శివ తన కాలేజ్ లో చదివే సంధ్య (డింపుల్) ని చూసి ప్రేమలో పడతాడు. సంధ్య కూడా శివపై మనసు పడి వారి ప్రేమ ముదిరి ఆమె గర్భవతి అవుతుంది, దాంతో వాళ్లిదరు పెళ్లి చేసుకుంటారు. శివకి పుట్టిన బిడ్డకి తను తండ్రే కాదని మహేష్ అనే వ్యక్తి కారణమనే విషయం తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న శివ మహేష్ ని వెతికే పనిలో పడతాడు. అసలు ఈ మహేష్ ఎవరు ? శివ చివరికి మహేష్ ని పట్టుకోగలిగాడా ? లేదా అనేదే మిగతా సినిమా కథ.[2]