వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | సియాల్‌కోట్, పంజాబ్, పాకిస్తాన్ | 10 మార్చి 1990|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 226) | 2017 ఏప్రిల్ 21 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2021 ఆగస్టు 20 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 220) | 2019 మార్చి 22 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2019 మార్చి 31 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–2015 | Sialkot Stallions | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2019 | Multan Sultans (స్క్వాడ్ నం. 26) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2019 | లీసెస్టర్‌షైర్ (స్క్వాడ్ నం. 26) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–present | Southern పంజాబ్ (స్క్వాడ్ నం. 38) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021–present | హాంప్‌షైర్ (స్క్వాడ్ నం. 38) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 8 April 2023 |
మహ్మద్ అబ్బాస్ (జననం 1990, మార్చి 10) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు కోసం, దేశీయంగా దక్షిణ పంజాబ్ కోసం ఆడుతున్నాడు.[1]
2018 ఆగస్టులో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ద్వారా 2018–19 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ముప్పై-మూడు మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[2][3] ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2018లో పురుషుల క్రికెట్‌లో ఐదు బ్రేకౌట్ స్టార్‌లలో అబ్బాస్‌ను ఒకరిగా పేర్కొంది.[4] 2021 జూలైలో, జాతీయ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైన కారణంగా అబ్బాస్ తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు.[5]
అబ్బాస్ 2015–16 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీశాడు, టోర్నమెంట్‌లో మొత్తం 61 అవుట్‌లను చేశాడు.[6] తరువాతి టోర్నమెంట్‌లో అతను 71 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు.[7]
2021 ఏప్రిల్ లో, మిడిల్‌సెక్స్‌తో జరిగిన హాంప్‌షైర్ మ్యాచ్‌లో, మిడిల్‌సెక్స్ మొదటి ఇన్నింగ్స్‌లో అబ్బాస్ హ్యాట్రిక్ సాధించాడు.[8] 2022 జనవరిలో, 2022 కౌంటీ ఛాంపియన్‌షిప్‌కు ముందు హాంప్‌షైర్‌తో మళ్ళీ సంతకం చేశాడు.[9]
2017 ఏప్రిల్ లో, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అబ్బాస్‌ని పాకిస్తాన్ టెస్ట్ జట్టులో చేర్చారు.[10] 2017 ఏప్రిల్ 21న సబీనా పార్క్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన అరంగేట్రం చేశాడు. తన రెండో బంతికే తన తొలి టెస్టు వికెట్‌ని సాధించాడు, క్రైగ్ బ్రాత్‌వైట్‌ను అవుట్ చేసి మూడు వికెట్లతో మ్యాచ్‌ను ముగించాడు.[11] తన మూడో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై తన తొలి ఐదు వికెట్లు సాధించాడు.[12]
2019 మార్చిలో, ఆస్ట్రేలియాతో జరిగిన వారి సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[13][14] 2019 మార్చి 22న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన వన్డే అరంగేట్రం చేసాడు.[15] 2019 నవంబరులో, మళ్ళీ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. రెండో టెస్టులో ఆడినా ఒక్క వికెట్ కూడా తీయలేదు.[16]