వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | హైదరాబాద్, సింధ్, పాకిస్థాన్ | 2000 ఏప్రిల్ 5|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 1 అం. (185 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 222) | 2019 మార్చి 24 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 జనవరి 13 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 82) | 2019 మే 5 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 అక్టోబరు 13 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19 | Pakistan Television | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–present | Quetta Gladiators | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | Trinbago Knight Riders | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019/20–present | Sindh | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021/22 | Sydney Thunder | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | వోర్సెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | Oval Invincibles | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2023 జనవరి 15 |
మొహమ్మద్ హస్నైన్ (జననం 2000, ఏప్రిల్ 5) పాకిస్తానీ క్రికెటర్. 2019 నుండి పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆడుతున్నాడు. గంటకు 150 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వేగవంతమైన బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు.[2][3]
హస్నైన్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ నగరానికి చెందిన ఆరుగురు సభ్యుల కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి హైదరాబాద్‌లోని హీరాబాద్‌లో పశువుల దాణా దుకాణాన్ని కలిగి ఉన్నాడు. మహ్మద్ హుస్సేన్ స్వయంగా క్రికెటర్ (వికెట్ కీపర్. ఆపై ఫాస్ట్ బౌలర్). తన పెద్ద కుటుంబాన్ని పోషించుకోవడానికి క్రికెట్ ను వదులుకోవాల్సి వచ్చింది.[4]
2018 సెప్టెంబరు 1న 2018–19 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో పాకిస్తాన్ టెలివిజన్ కోసం ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[5] 2019 ఫిబ్రవరి 27న 2019 పాకిస్తాన్ సూపర్ లీగ్లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[6] ఈ టోర్నమెంట్‌లో 151 కి.మీ/గం వేగంతో బౌలింగ్ చేసిన ప్రసిద్ధి చెందాడు.[7] 4 ఓవర్లలో 3/30 బౌలింగ్ చేసినందుకు ఫైనల్‌లో పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించబడ్డాడు. ఫైనల్‌లో ఆ అవార్డును పొందిన మొదటి స్థానికుడిగా నిలిచాడు.[8]
2019 మార్చిలో ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[9][10] 2019 మార్చి 24న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[11]
2019 ఏప్రిల్ లో 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[12][13] 2019 మే 5న ఇంగ్లాండ్‌పై పాకిస్తాన్ తరపున తన ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[14] 2019 అక్టోబరు 5న శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో 19 సంవత్సరాల 183 రోజుల వయస్సులో హస్నైన్ టీ20 మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసిన అతి పిన్న వయస్కుడైన బౌలర్‌గా, పాకిస్తాన్‌కి రెండవవాడు, మొత్తం తొమ్మిదో బౌలర్‌గా నిలిచాడు.[15][16]
చట్టవిరుద్ధమైన బౌలింగ్ చర్య కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా 2022 ఫిబ్రవరిలో హస్నైన్‌ను సస్పెండ్ చేసింది.[17] 2022 జూన్ లో ఇతని చర్యపై అంచనాలను అనుసరించి అతను బౌలింగ్ చేయడానికి అనుమతించబడ్డాడు.[18]
2022 ఆగస్టు 22న గాయపడిన షాహీన్ అఫ్రిది స్థానంలో ఆసియా కప్ కోసం హస్నైన్ ఎంపికయ్యాడు.[19]
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)