మా గోపి (1954 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎస్.రంగా |
---|---|
తారాగణం | చిత్తూరు నాగయ్య, జమున, జి.వరలక్ష్మి |
సంగీతం | విశ్వనాథన్ - రామమూర్తి |
నిర్మాణ సంస్థ | విక్రమ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
విక్రమ్ ప్రొడక్షన్స్ ను స్థాపించి ఛాయాగ్రాహకుడు బి.ఎస్.రంగా దర్శకత్వం వహించి నిర్మించిన తొలిచిత్రం మా గోపి.ఈ సినిమా 1954, సెప్టెంబరు 24న విడుదలయ్యింది. ఈ సినిమాను జయగోపి అన్న పేరుతో డబ్బింగు చేసి తమిళంలో విడుదల చేశారు. ఇదే చిత్రాన్ని 1981లో ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ కన్నడ భాషలో భాగ్యవంత అనే పేరుతో పునర్నిర్మించాడు.
పుట్టగానే తల్లిదండ్రులను కోల్పోయిన గోపీ అనే పిల్లవాణ్ణి అతని పెద్దమ్మ, పెద్దనాన్న చేరదీసి పెంచుతుంటారు. అందరూ గోపీని అరిష్టకారకుడని నిందిస్తూ, దూరంగా తరిమివేస్తున్నా పెద్దనాన్న ఒక్కడే అతడిని ప్రేమతో సాకుతూ వుంటాడు. గోపీ అన్న బలరాం కూడా గోపీని అసహ్యించుకుంటూ వుంటాడు. కానీ కొత్తగా పెళ్ళయి కాపురానికి వచ్చిన అతని భార్య సుశీల గోపీపై ఎనలేని ప్రేమ కురిపిస్తూ తల్లివలె సాకుతుంది. అనేక కష్టాలు పడిన తర్వాత గోపీ అరిష్ట జాతకుడు కాడని అదృష్టదాయకుడని అందరూ గ్రహించి పశ్చాత్తాప పడతారు[1].
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.