మాచర్ల నియోజకవర్గం | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి |
రచన | ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి |
నిర్మాత | సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ప్రసాద్ మూరెళ్ల |
సంగీతం | మహతి స్వరసాగర్ |
నిర్మాణ సంస్థ | శ్రేష్ట్ మూవీస్ |
విడుదల తేదీ | 12 ఆగస్టు 2022(థియేటర్) 9 డిసెంబరు 2022 (జీ5 ఓటీటీ) |
దేశం | ![]() |
భాష | తెలుగు |
మాచర్ల నియోజకవర్గం తెలుగులో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. నితిన్, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన నటించిన ఈ సినిమా 2022 ఆగష్టు 12న విడుదలై [1],[2] డిసెంబర్ 9న జీ5 ఓటీటీలో విడుదల కానుంది.[3]
రాజప్ప(సముద్రఖని) తండ్రి చనిపోగానే అతనికి సీటు ఇవ్వడానికి అధిష్టానం వెనకడుగు వేస్తే అధిష్టానం సీట్ ఇచ్చి పోటీ చేయించిన వ్యక్తిని చంపి రాజప్ప మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ తరువాత 30 ఏళ్లుగా ఎన్నికలు జరగనివ్వకుండా మాచర్ల ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికవుతుంతాడు. ఈ సమయంలో సివిల్స్ రాసి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సిద్దార్థ్ రెడ్డి (నితిన్) ప్రేమించిన అమ్మాయి స్వాతి (కృతి శెట్టి) కోసం మాచర్ల వెళతాడు. మాచర్లలో నిధి(కేథరిన్) చేసిన పనికి అదే జిల్లాకు కలెక్టర్ అవుతాడు. జిల్లా కలెక్టరుగా ఛార్జ్ తీసుకున్న తర్వాత 30 ఏళ్ల నుంచి ఎన్నికలే లేకుండా ఏకగ్రీవం అవుతుందనే విషయం తెలుసుకుని ఎన్నికలు జరిపేందుకు నిలబడతాడు. మాచర్లలో ఎన్నికలు నిర్వహించాలని అతను చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయి? ఈ క్రమంలో అతడు ఎలాంటి పరిణామాలను ఎదురుకున్నాడు అనేదే మిగతా సినిమా కథ.[4]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)