మాడంపు శంకరన్ నంబూద్రి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | కిరాలూర్, త్రిస్సూర్ జిల్లా, కేరళ రాష్ట్రం, భారతదేశం | 1941 జూన్ 23
మరణం | 2021 మే 11 త్రిస్సూర్ | (వయసు 79)
కలం పేరు | మాడంపు కుంజుకుట్టన్ |
వృత్తి |
|
జాతీయత | భారతదేశం |
రచనా రంగం | నవల, లఘు చిత్రాలు |
విషయం | సామజిక అంశాలు |
పురస్కారాలు | ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు |
జీవిత భాగస్వామి | కి.శే సావిత్రి అంతర్జనమ్ |
మాడంపు శంకరన్ నంబూద్రి (1941, జూన్ 23 − 2021, మే 11), మాడంపు కుంజుకుట్టన్ మలయాళ సినీ రచయిత, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు.[1]
కుంజుకుట్టన్ 1941, జూన్ 23న కేరళ రాష్ట్రం, త్రిస్సూర్ జిల్లా, కిరలూర్ గ్రామంలో జన్మించాడు. ఆయన సంస్కృతం, హస్థాయుర్వేదం (ఏనుగులకు వైద్యం) చదివాడు. ఆయన కొడుంగల్లూర్ లో సంస్కృతం ఉపాధ్యాయుడిగా, గుడిలో పూజారిగా పనిచేశాడు. మడంపు కొంతకాలం ఆకాశవాణిలో (ఆల్ ఇండియా రేడియో) కూడా పనిచేశాడు. ఆయనకు భార్య కి.శే.సావిత్రి అంతర్జనమ్, ఇద్దరు కూతుళ్లు జసీనా మడంపు, హసీనా మడంపు ఉన్నారు.
మాడంపు కుంజుకుట్టన్ రాసిన మహాప్రస్థానం నవలకు గాను 1984లో కేరళ సాహిత్య అకాడెమీ అవార్డు అందుకున్నాడు. ఆయన 2000లో మలయాళం సినిమా కరుణానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా జాతీయ అవార్డు అందుకున్నాడు.[2] కుంజుకుట్టన్ 2001లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కొడుంగళూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.[3][4]