మాధురీ మెహతా, ఒడిషాకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1] 2012లో వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టుపై మహిళల వన్డే ఇంటర్నేషనల్, ఉమెన్స్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో ఆడింది.[1]ఒడిశా నుంచి మహిళల జాతీయ జట్టుకు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచింది.[2]
2012 ఫిబ్రవరి 29న వెస్టిండీస్తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసింది.[3] 2012 మార్చి 2న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[4]
2012 ఫిబ్రవరి 27న వెస్టిండీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ తో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసింది.[5] 2014 మార్చి 30న బంగ్లాదేశ్తో జరిగిన టీ20 మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[6]