మాబెల్లే అరోల్ - మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో 26 డిసెంబర్ 1935లో జన్మించారు. ఆమె అసలు పేరు మాబెల్లే ఇమ్మాన్యుయేల్. డ్యూక్ విశ్వవిద్యాలయం, భారతదేశంలో బోధించిన థియాలజీ, గ్రీకు ప్రొఫెసర్ కుమార్తె. ఆమె వివాహం డాక్టర్ రజనీకాంత్ అరోల్‌తో అయింది.[1][2] వారు తమ కొత్త జీవితాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని అట్టడుగువర్గాల సంరక్షణకు అంకితం చేస్తామని ప్రమాణం చేశారు. 1962-66లో ముంబైకి తూర్పున 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడాలలోని మిషన్ హాస్పిటల్‌లో పనిచేశారు. ఆ తరువాత, ఈ జంట జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్, సర్జరీలో వారి రెసిడెన్సీ శిక్షణ, అలాగే పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ పొందేందుకు ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌పై యునైటెడ్ స్టేట్స్‌లో నాలుగు సంవత్సరాలు శిక్షణపొందారు. కమ్యూనిటీ హెల్త్ రంగంలో అగ్రగామి అయిన కార్ల్ టేలర్ ఆధ్వర్యంలో, గ్రామీణ భారతదేశంలోని పేద, అట్టడుగు వర్గాలకు సమాజ ఆధారిత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, అభివృద్ధిని అందించడానికి కాంప్రహెన్సివ్ రూరల్ హెల్త్ ప్రాజెక్ట్ ఆలోచనను అరోల్స్ రూపొందించారు.[3] ఆమె భర్తతో కలసి సమగ్ర గ్రామీణ ఆరోగ్య ప్రాజెక్ట్ నిర్వహించి చేసిన విశేష కృషికి గానూ కమ్యూనిటీ లీడర్‌షిప్ కింద 1979లో రామన్ మెగసెసే అవార్డు'ను అందుకున్నారు.[4] 1999లో మరణించిన మాబెల్లే అరోల్ జ్ఞాపకార్థం, ఆమె పేరు మీద ఫెలోషిప్ రజనీకాంత్ అరోల్ 2001లో ప్రారంభించారు. వీరి సంతానం రవి అరోల్(కొడుకు), శోభ(కూతురు).
యుఎస్‌లో తమ చదువు తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన అరోల్ దంపతులు పేద, కరవు పీడిత ప్రాంతమైన జామ్‌ఖేడ్‌లో పనిచేయాలని నిర్ణయించుకున్నారు.[5] జామ్‌ఖేడ్ గ్రామ నాయకులు తమ ప్రాజెక్ట్ ని ఆహ్వానించారు. ఇక అరోల్ దంపతులు అక్కడే స్థిరపడిపోయారు. ఆగస్టు 1970లో సమగ్ర గ్రామీణ ఆరోగ్య ప్రాజెక్ట్(CRHP)ని స్థాపించారు.[6] ఇది ప్రారంభంలో 8 గ్రామాలకు పరిమితం అయినా మొత్తం జనాభా 10,000.
అలా 25 సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ 178 గ్రామాలకు విస్తరించి 250,000 మందికి లబ్దిచేకూరింది. చక్కని ఫలితాలు అందుకుంది. శిశు మరణాలు 1,000 జనాభాకు 176 నుండి 23కి పడిపోయాయి. ఆరోగ్యం విషయంలో గ్రామాలలో గణనీయమైన మెరుగుదల కనపడింది. గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పోషకాహారలోపం లేకుండా దాదాపు ఒక శాతానికి వచ్చింది.[7]
మరో 15 సంవత్సరాలలో 300 గ్రామాలకు విస్తరించిన కంప్రెస్సివ్ రూరల్ హెల్త్ ప్రాజెక్ట్ 500,000 మందికి పైగా ప్రజలకు మేలు చేసింది. అంతేకాకుండా పరోక్షంగా ఈ సంస్థ ప్రభావం ఒక మిలియన్ మందిపై ఉంటుందని అంచనా వేయబడింది.[8]
1989లో అరోల్ దంపతులు తమ అనుభవాలను పుస్తకంగా రాయడానికి గ్రాంట్ పొంది, అది రెండేళ్లలో పూర్తిచేసారు. 1994లో ప్రచురితమైన జామ్‌ఖేడ్ లో సమగ్ర గ్రామీణ ఆరోగ్య ప్రాజెక్ట్ ప్రారంభం నుండి దాని అభివృద్ధిని వివరించారు.[6] ప్రజారోగ్య రంగంలో అభ్యాసకులకు ఇది ఒక క్లాసిక్ రీడ్ లాంటిది.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)