మాయామాళవగౌళ రాగము కర్ణాటక సంగీతంలో 15వ మేళకర్త రాగము.[1] దీనినే మాళవగౌళ రాగము అని కూడా అంటారు. ఇది సుమారు మూడు నాలుగు వందల సంవత్సరాల నుండి వాడుకలోనున్న ప్రాచీన రాగము. ఇది హిందుస్థానీ సంగీతం లోని భైరవ రాగంతో సమానమైనది.యిది అగ్ని యని మూడవ చక్రమునకు చెందినది. ఆ చక్రములో మూడవ శ్రేణి లోనిది.
ఈ రాగం స్వరాలు షడ్జమము, శుద్ధ రిషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ ధైవతము, కాకలి నిషాధము. ఇది 51వ మేళకర్త కామవర్ధిని (పంతువరాళి) రాగానికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.
సర్వస్వర గమక వరిక రాగము. ప్రాచీన రాగము. అన్ని వేలల యందును పాడదగు రాగము. అనురాగగుణనును హాయినిచ్చు రాగము. ఉత్తమోత్తమ రాగము. సంగీత కళకు పునాది రాగము, కర్ణాటక సంగీత విద్యార్థులు దీనినే ప్రప్రథమముగా నేర్చుకుందురు.
శుద్ధ రాగము, హిందూస్తానీ సంగీతములో దీనిని పోలిన రాగము "భైరవ రాగము".
పెక్కు జన్య రాగ సంతానము గల జనక రాగము. గాంధార నిషాదములు జీవ స్వరములు. గాంధార పంచమములు విశ్రాంతి స్వరములు. దోషరహిత రాగము. షడ్జమము, గాంధారము, దైవతము, నిషాధములపై రచనలు ప్రారంభించును. సంగీత రత్నాకరమందును పేర్కొనబడిన రాగము. పూర్వము దీనిని మాళవ గౌళ అనియే పేరు. 15 వ మేళముగా సరిదిద్దుకొనుటకు "మాయా" అను పదములు చేర్చబడినవి.
ఆగల స్వరములు, కంపిత స్వరములు కలిగిన రాగము. నెమ్మదిగా నైననూ, తీవ్రముగానైననూ జంటస్వరములు, దాటు స్వరములు పాడవచ్చును.
ఈ రాగంలో కొన్ని ప్రముఖమైన జన్యరాగాలు: బౌళి, జగన్మోహిని, గౌళ, గౌళిపంతు, లలిత, నాథనామక్రియ, రేవగుప్తి, సావేవి, మళహరి.
రచన | నామము | తాళము | రచయిత |
లక్షణ గీతము | రవికోటి తేజ | మఠ్య తాళం | వేంకటమఖి |
కృతి | మేరుసమాన | మధ్యాది | త్యాగరాజు |
కృతి | తులసీ దళములచే | రూపకము | త్యాగరాజు |
కృతి | విదులకు మ్రొక్కెద | ఆది | త్యాగరాజు |
కృతి | శ్రీ నతాది | ఆది | ముత్తుస్వామి దీక్షితులు |
కృతి | దేవాదిదేవ | ఆది | మైసూరు సదాశివరావు |