వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | క్లెర్క్స్‌డార్ప్, నార్త్‌వెస్ట్, దక్షిణాఫ్రికా | 2000 మే 1|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 2.09 మీ. (6 అ. 10 అం.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Bowling ఆల్ రౌండరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | Duan Jansen (Twin brother) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 349) | 2021 డిసెంబరు 26 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 ఫిబ్రవరి 28 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 144) | 2022 జనవరి 19 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 ఏప్రిల్ 2 - నెదర్లాండ్స్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 70 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 96) | 2022 జూన్ 17 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 ఆగస్టు 30 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 70 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | North West | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–2020 | నైట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020–2021 | వారియర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022–present | సన్ రైజర్స్ హైదరాబాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022–present | Sunrisers Eastern Cape | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2 April 2023 |
మార్కో జాన్సెన్ (జననం 2000 మే 1) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. అతను దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టుకు, దేశీయ మ్యాచ్‌లలో వారియర్స్‌కూ ఆడతాడు. [2]
అతని ప్రారంభ సంవత్సరాల్లో, జాన్సెన్ బ్యాటింగులో ఓపెనరుగా దిగేవాడు. తొమ్మిదేళ్ల వయసులో, 20 ఓవర్ల మ్యాచ్‌లో, అతను 164 పరుగులు చేశాడు. అతని తండ్రి ఆ మ్యాచ్‌ని చూసి కొడుకు ప్రతిభను గుర్తించాడు. అతనికి, అతని కవల సోదరుడు డువాన్‌కూ కలిపి నెట్స్‌లో శిక్షణ ఇచ్చాడు. [3] డువాన్ కూడా నార్త్ వెస్టు తరపున క్రికెట్ ఆడతాడు. [4]
జాన్సెన్, 2018 ఏప్రిల్ 8న 2017–18 CSA ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో నార్త్ వెస్టు కోసం తన లిస్టు A అరంగేట్రం చేశాడు [5] అతను 2018 అక్టోబరు 11న 2018–19 CSA 3-డే ప్రొవిన్షియల్ కప్‌లో నార్త్ వెస్టు తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు [6]
2019 జనవరిలో, జాన్సెన్ భారతదేశ పర్యటనకు ముందు దక్షిణాఫ్రికా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు జట్టులో ఎంపికయ్యాడు. [7] అతను 2018–19 CSA 3-డే ప్రొవిన్షియల్ కప్‌లో నార్త్ వెస్టు తరపున ఆరు మ్యాచ్‌లలో 27 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలరు. [8]
జాన్సెన్ 2019 ఏప్రిల్ 28న 2018–19 CSA T20 ఛాలెంజ్‌లో నైట్స్ కోసం తన ట్వంటీ20 రంగ ప్రవేశం చేసాడు [9] అతను 2018–19 CSA 3-డే ప్రొవిన్షియల్ కప్‌లో నార్త్ వెస్టు తరపున ఆరు మ్యాచ్‌లలో 27 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలరయ్యాడు. [10]
2019 సెప్టెంబరులో, 2019 మజాన్సి సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం డర్బన్ హీట్ జట్టుకు జాన్సెన్ ఎంపికయ్యాడు. [11]
ఫిబ్రవరి 2021లో , 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ముందు జరిగిన ఐపిఎల్ వేలంలో జాన్సన్ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.[12] జాన్సన్ 9 ఏప్రిల్ 2021న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అతను తన 4 ఓవర్లలో 28 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు , ఇందులో గ్లెన్ మాక్స్వెల్ వికెట్ కూడా ఉంది - అతని తొలి ఐపిఎల్ వికెట్.[13] అదే నెలలో దక్షిణాఫ్రికాలో 2021 - 22 క్రికెట్ సీజన్కు ముందు తూర్పు ప్రావిన్స్ జట్టులో అతన్ని ఎంపిక చేశారు.[14]
2022 ఫిబ్రవరిలో జాన్సెన్‌ను 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. [15]
2023 మేలో, ప్రారంభ 2023 మేజర్ లీగ్ క్రికెట్ పోటీలో ఆడేందుకు జాన్సెన్‌ను వాషింగ్టన్ ఫ్రీడమ్ ఎంపిక చేసింది.
2021 జనవరిలో, పాకిస్తాన్‌తో జరిగే సిరీస్ కోసం జాన్సెన్‌ను దక్షిణాఫ్రికా టెస్టు జట్టులోకి తీసుకున్నారు. [16]
2021 మేలో, వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో జాన్సెన్‌ను ఎంపిక చేశారు. [17] 2021 డిసెంబరులో, జాన్సెన్ దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు మరొక పిలుపు అందుకున్నాడు -ఈసారి భారత్‌తో జరిగే వారి స్వదేశీ సిరీస్ కోసం. [18] అతను 2021 డిసెంబరు 26న భారత్‌పై తన టెస్టు రంగప్రవేశం చేశాడు. [19] అతని తొలి టెస్టు వికెట్ జస్ప్రీత్ బుమ్రా, మూడో స్లిప్‌లో వియాన్ ముల్డర్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. [20]
2022 జనవరిలో, జాన్సెన్ తన తొలి వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) పిలుపు భారత్‌తో దక్షిణాఫ్రికా స్వదేశీ సిరీస్ కోసం పొందాడు. [21] అతను 2022 జనవరి 19న భారత్‌పై దక్షిణాఫ్రికా తరపున తన తొలి వన్‌డే ఆడాడు. [22] 2022 మేలో, జాన్సెన్ దక్షిణాఫ్రికా ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) స్క్వాడ్‌లో భారతదేశంలో విదేశీ సిరీస్ కోసం ఎంపికయ్యాడు. [23] అతను తన తొలి T20I మ్యాచ్ 2022 జూన్ 17న, దక్షిణాఫ్రికా తరపున భారతదేశానికి వ్యతిరేకంగా ఆడాడు. [24]