మాస్ట్రో | |
---|---|
దర్శకత్వం | మేర్లపాక గాంధీ |
దీనిపై ఆధారితం | హిందీ సినిమా అంధాదున్ కి రీమేక్ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | జె యువరాజ్ |
కూర్పు | ఎస్.ఆర్ శేఖర్ |
సంగీతం | సాగర్ మహతి |
నిర్మాణ సంస్థ | శ్రేష్ఠ్ మూవీస్ |
విడుదల తేదీ | 17 సెప్టెంబర్ 2021 |
సినిమా నిడివి | 138 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మాస్ట్రో 2021లో నిర్మించిన తెలుగు సినిమా. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు..[1] మాస్ట్రో డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో 17 సెప్టెంబర్ 2021న విడుదలైంది.
అరుణ్(నితిన్) ఓ పియానో ప్లేయర్. ఈ క్రమంలోనే ఓ రెస్టారెంట్‌లో అమ్మకానికి ఉన్న పియానో కొందామని వెళ్లి ఆ రెస్టారెంట్ ఓనర్ కుమార్తె సోఫి(నభా నటేశ్)తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. అదే రెస్టారెంట్‌కు తరచూ వచ్చే ఒకప్పటి హీరో అయిన మోహన్ (నరేశ్) అరుణ్‌లోని టాలెంట్ చూసి తన రెండో భార్య (సిమ్రన్)తో తన వివాహ వార్షికోత్సవానికి ఇంటికొచ్చి ప్రైవేట్ కన్సర్ట్ చేయాల్సిందిగా అతణ్ని కోరతాడు. అరుణ్ మోహన్ ఇంటికి వెళ్లే సరికి అతడు హత్యకు గురవుతాడు. సిమ్రాన్ తన ప్రియుడి (జిషుసేన్‌గుప్తా) తో కలిసి మోహన్‌ను చంపిందనే విషయాన్ని అరుణ్ గ్రహిస్తాడు. వారిపై పోలీస్ కైంప్లెంట్ ఇవ్వాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అంధుడైన అరుణ్ ఆ హత్య విషయాన్ని పోలీసులకు చెప్పాడా? అనేదే మిగతా సినిమా కథ.[2]
ఈ సినిమా హిందీ సినిమా అంధాధూన్’ కు తెలుగు రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి రీమేక్ హక్కులను సెప్టెంబర్ 2019లో శ్రేష్ట్ మూవీస్ అధినేత ఎన్. సుదాకర్ రెడ్డి పొందాడు.ఈ చిత్రాన్ని 2020 ఫిబ్రవరి 24న ప్రారంభించారు.[3] ఈ సినిమా షూటింగ్ ఈ సినిమాను 2021 జూన్ 11న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. కరోనా కారణంగా వాయిదా పడడంతో రిలీజ్ ఆగి పోయింది. ఈ సినిమా షూటింగ్ జులై 2021లో పూర్తయింది.[4]