మిథన్ జంషెడ్ లామ్ | |
---|---|
![]() మిథన్‌లామ్ | |
జననం | మహారాష్ట్ర, భారతదేశం | 1898 మార్చి 2
మరణం | 1981 |
వృత్తి | న్యాయవాది సామాజిక కార్యకర్త. |
క్రియాశీల సంవత్సరాలు | 1919–1981 |
వీటికి ప్రసిద్ధి | మహిళల హక్కులు |
జీవిత భాగస్వామి | జంషెడ్ సోరభా లాం |
పిల్లలు | సోరాబ్ జంషెడ్ సోరభా లాం |
తల్లిదండ్రులు | అర్దేశీర్ టాటా హెరాబాయి టాటా |
పురస్కారాలు | పద్మ భూషణ్ కాబ్డెన్ క్లబ్ మెడల్ |
మిథన్ జంషెడ్ లామ్ (1898-1981) ఒక భారతీయ న్యాయవాది, సామాజిక కార్యకర్త. ఈమె ముంబై హైకోర్టులో మొదటి భారతీయ మహిళా న్యాయవాది.[1] ఈమె పద్మభూషణ్ పురస్కార గ్రహీత.[2]
ఈమె 1898లో అర్దేశీర్ టాటా, హెరాబాయి టాటాకు మహారాష్ట్రలో జన్మించింది. ఈమె ప్రాథమిక విద్యను పూణే జిల్లాలోని ఫుల్గావ్‌లో పూర్తిచేసింది. ఈమె ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీలో తన గ్రాడ్యుయేషన్ ను పూర్తిచేసింది. ఈమె ఎకనామిక్స్‌లో మొదటి స్థానంలో నిలిచినందుకు కాబ్డెన్ క్లబ్ పతకాన్ని గెలుచుకుని, గౌరవాలతో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీని పూర్తిచేసింది. భారతదేశంలో ఉమెన్ ఓటు హక్కు అనే అంశంపై హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులతో చర్చించే అవకాశం కూడా ఈమెకు లభించింది. ఈమె తన మాస్టర్స్ డిగ్రీని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పూర్తిచేసింది. ఈమె ఇంగ్లాండ్‌లో ఉండడం వల్ల భారతదేశంలో మహిళా ఓటు హక్కు కోసం వాదించడానికి దేశంలో ఉన్న సరోజిని నాయుడు, అనిబిసెంట్ వంటి భారతీయ మహిళా నాయకులతో కలిసే అవకాశం వచ్చింది.
ఈమె ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ సభ్యురాలు, 1961-62లో దాని అధ్యక్షురాలిగా కూడా పనిచేసింది. సమాజానికి ఈమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1962లో మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.[3]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)