మిమీ | |
---|---|
దర్శకత్వం | లక్ష్మణ్ ఉటేకర్ |
రచన | కథ, స్క్రీన్ ప్లే: లక్ష్మణ్ ఉటేకర్ రోహన్ శంకర్ డైలాగ్స్: రోహన్ శంకర్ |
నిర్మాత | దినేష్ విజన్ జియో స్టూడియోస్ |
తారాగణం | కృతి సనన్ , పంకజ్ త్రిపాఠి |
ఛాయాగ్రహణం | ఆకాష్ అగర్వాల్ |
కూర్పు | మనీష్ ప్రధాన్ |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థలు | మ్యాడ్‌డాక్ ఫిలింస్ జియో స్టూడియోస్ |
పంపిణీదార్లు | జియో సినిమా నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీ | 26 జులై 2021 [1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
మిమీ 2021లో విడుదలైన హిందీ సినిమా. మ్యాడ్‌డాక్ ఫిలింస్, జియో స్టూడియోస్ బ్యానర్లపై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. కృతి సనన్ , పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 30 జులై 2021న విడుదల కానుంది.[2] ఈ సినిమాను జూలై 30న విడుదల చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావించింది, కానీ వెబ్‌సైట్స్‌లో పైరసీ రిలీజ్ కావడంతో జూలై 26న సినిమాను విడుదల చేశారు.[3]
69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, ఈ సినిమా ఉత్తమ నటి (సనన్), ఉత్తమ సహాయ నటుడు (త్రిపాఠి) విభాగాల్లో 2 అవార్డులను గెలుచుకుంది.[4] 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో, మిమీ ఉత్తమ సంగీత దర్శకుడు (రెహమాన్), ఉత్తమ నేపథ్య గాయని (" పరమ సుందరి "కి శ్రేయా ఘోషల్ ) సహా 6 నామినేషన్లు అందుకుంది, 3 అవార్డులను ఉత్తమ నటి (సనన్), ఉత్తమ సహాయ నటుడు (త్రిపాఠి), ఉత్తమ సహాయ నటి (తమ్హంకర్) గెలుచుకుంది.[5]
అవివాహిత అయిన మిమి కృతి సనన్ ను ఆమె మిత్రుడు పంకజ్ త్రిపాఠి సరొగసిలో మంచి డబ్బు ఉందని ఒప్పిస్తాడు. విదేశీ జంట నుంచి 20 లక్షల రూపాయలకు డీల్ కుదురుతుంది. ఆ గర్భం దాల్చి బిడ్డను ఇవ్వడంలో భాగంగా ఆమె ఊరు విడిచి ఇంకో కొత్త ప్రాంతానికి వెళ్లి మిత్రుడిని భర్తగా చెప్పి నివాసం ఉంటుంది. అంతా బాగానే ఉందనుకున్న సమయాన డబ్బు ఇచ్చిన విదేశీ జంట తమకు ఆ బిడ్డ వద్దని చెబుతారు.. ఇప్పుడు బిడ్డను ఏం చేయాలి ? గర్భాన్ని మోస్తున్న హీరోయిన్‌ను ఆమె తల్లిదండ్రులు నిలదీస్తారు ? కడుపులో ఉన్న ఆ బిడ్డ భవిష్యత్తు ఏమిటి?? అనేదే మిగతా సినిమా కథ.