మిషన్ రాణిగంజ్ | |
---|---|
దర్శకత్వం | టిను సురేశ్ దేశాయ్ |
స్క్రీన్ ప్లే | విపుల్ కే రావల్ |
మాటలు | దీపక్ కింగ్రని |
కథ | దీపక్ కిఞ్జరని పూనమ్ గిల్ (ఐడియా) |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | అసీం మిశ్రా |
కూర్పు | ఆరిఫ్ షేక్ |
సంగీతం | పాటలు: సతిండెర్ సర్తాజ్ ప్రేమ్ -హర్దీప్ ఆర్కో విశాల్ మిశ్రా గౌరవ్ ఛటర్జీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సందీప్ శిరోద్కర్ |
నిర్మాణ సంస్థలు | పూజా ఎంటర్‌టైనమెంట్స్ ఏ కె ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | పీవీఆర్ ఇనాక్స్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 6 అక్టోబరు 2023 |
సినిమా నిడివి | 134 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 55 కోట్లు[2] |
బాక్సాఫీసు | 24.41 కోట్లు[3] |
మిషన్ రాణిగంజ్ 2023లో విడుదలైన హిందీ సినిమా. పూజా ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై అక్షయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు టిను సురేశ్ దేశాయ్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, పరిణితి చోప్రా, కుముద్ మిశ్రా, పవన్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను అక్టోబర్ 6న విడుదలైంది.[4] మిషన్ రాణిగంజ్ సినిమా జనరల్ కేటగిరీలో ఇండిపెండెంట్‌గా ఆస్కార్ కోసం నామినేషన్ వేసింది.[5][6]
1989లో పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్ కోల్ ఫీల్డ్స్ కూలిపోయిన సమయంలో 65 మంది గని కార్మికులను రక్షించిన జస్వంత్ సింగ్ గిల్ జీవితం ఆధారంగా[10] పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్‌శిఖా దేశ్‌ముఖ్ నిర్మించారు.[11] ఈ సినిమాకు మొదట క్యాప్సూల్ గిల్ అని పేరు పెట్టారు[12], తర్వాత దానిని ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూగా మర్చి సెప్టెంబర్ 2023లో పోస్టర్ విడుదలతో, పేరు మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూగా మార్చబడింది.[13] [14]