మిస్టర్ మేధావి (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నీలకంఠ |
---|---|
నిర్మాణం | బొద్దులూరి రామారావు లగడపాటి గోపీచంద్ |
కథ | నీలకంఠ |
చిత్రానువాదం | నీలకంఠ |
తారాగణం | రాజా జెనీలియా సోనూ సూద్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం సుమన తనికెళ్ళ భరణి ఎమ్.ఎస్.నారాయణ బ్రహ్మానందం మల్లేశ్ బలష్టు |
సంగీతం | చక్రి |
సంభాషణలు | నీలకంఠ |
ఛాయాగ్రహణం | సునీల్ రెడ్డి |
నిర్మాణ సంస్థ | లైఫ్ స్టైల్ ఆర్ట్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 26 జనవరి 2008 |
భాష | తెలుగు |
పెట్టుబడి | 31 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మిస్టర్ మేధావి జి. నీలకాంఠ రెడ్డి దర్శకత్వం వహించిన 2008 తెలుగు చిత్రం. ఈ చిత్రంలో రాజా అబెల్, జెనెలియా డిసౌజా, సోను సూద్ నటించారు.[1]
విశ్వక్ (రాజా) కెనడా నుండి అమ్మమ్మ వద్దకు వచ్చిన శ్వేత (జెనెలియా) ను కలుస్తాడు. ఆమె స్థానిక పాఠశాలకు వెళుతుంది. అక్కడ ఆమె విశ్వక్ ను కలుస్తుంది. విశ్వక్ కు ఆమెపై ఏకపక్ష ప్రేమ వికసిస్తుంది. అది అతడితో పెరుగుతుంది.
రాజా పేదరికపు నేపథ్యం అతడికి తాను చేసే ప్రతీ పనిలోనూ జాగ్రత్తగా ఉండడం నేర్పిస్తుంది. ఏ పరిస్థితినైనా తనకు అనుకూలంగా మలచుకునే కళను అతను త్వరలోనే నేర్చుకుంటాడు. విధి అతన్ని శ్వేత తండ్రి యాజమాన్యంలోని సంస్థకు తీసుకువస్తుంది. ఇక్కడ, పాత స్నేహితులు మరోసారి కలుస్తారు. ఇప్పుడు, శ్వేత తన బాస్ కుమార్తె. ఆమె ఒక ఔషధ సంస్థను స్థాపించాలని కలలు కంటోంది. ఆ సమయంలోనే శ్వేత విశ్వక్ కలిసి పనిచేస్తూ, కలిసి సమయం గడుపుతారు.
శ్వేత తనను ప్రేమించేలా చేసుకునేందుకు విశ్వక్ పనిచేస్తూండగా, కోటీశ్వరుడైన హెచ్ఆర్ గురువు సిదార్థ్ (సోను సూద్) తో ప్రేమలో ఉన్నానని ఆమె ప్రకటించి అతడికి ఆశ్చర్యం కలిగిస్తుంది. తన గేమ్ ప్లాన్ వెనక్కి తన్నడంతో విశ్వక్, శ్వేత మనస్సు నుండి సిదార్థను తీసెయ్యడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. కానీ అతను ఎంత ఎక్కువ ప్రయత్నిస్తే, ఆమె సిద్దార్థపై ఆమె నమ్మకం అంత ఎక్కువ అవుతూ ఉంటుంది.
విశ్వక్ తన ప్రేమను పొందుతాడా లేదా కోల్పోతాడా?
కళ్ళు కళ్ళతో , రచన: కందికొండ యాదగిరి , గానం.కె ఎస్ చిత్ర
నీలి కన్నుల చిన్నదాన , రచన: కందికొండ , గానం.ఎస్.పి.బి.చరన్, కౌసల్య
కలకాదుగా , రచన: కందికొండ , గానం.చక్రి
నీటి చినుకు , రచన: కందికొండ , గానం.హరీష్ రాఘవేంద్ర, సుమంగళి
నింగి నేల, రచన: కందికొండ , గానం.చక్రి
ఓ మగువా , రచన: భువన చంద్ర, గానం.నవీన్, సుచిత్ర .