మీలో ఎవరు కోటీశ్వరుడు | |
---|---|
దర్శకత్వం | ఇ. సత్తిబాబు |
రచన | నాగేంద్రకుమార్ వేపూరి |
నిర్మాత | కె.కె.రాధామోహన్ |
తారాగణం | బలిరెడ్డి పృథ్వీరాజ్ సలోని పోసాని కృష్ణమురళి |
ఛాయాగ్రహణం | బాల్‌రెడ్డి పి |
కూర్పు | గౌతమ్‌రాజు |
సంగీతం | శ్రీవసంత్ |
నిర్మాణ సంస్థ |
మీలో ఎవరు కోటీశ్వరుడు 2016 లో విడుదలైన తెలుగు హాస్య సినిమా.[1]
రైతు (చలపతిరావు) కొడుకు ప్రశాంత్ (నవీన్ చంద్ర). వ్యాపారవేత్త ఏబీఆర్ (మురళీ శర్మ) కుమార్తె ప్రియ (శ్రుతిసోది). అనుకోని పరిస్థితుల్లో ప్రియ, ప్రశాంత్ కలుసుకుంటారు. ప్రశాంత్ వ్యక్తిత్వం మీద ప్రియకు గురి కుదురుతుంది. తప్పు చేసే అవకాశం ఉన్నా చేయలేదంటే ఆ కుర్రాడు మంచి వాడని అనుకొంటుంది. అతన్ని ప్రేమించడం మొదలుపెడుతుంది. అంతస్తుల తేడాను అర్థం చేసుకున్న ప్రశాంత్ ఆమెకు దూరంగా ఉండాలనుకుంటాడు. అయితే ఆమె అభ్యర్ధన మేరకు తమ పల్లెటూరికి తీసుకెళ్తాడు. కోటీశ్వరుల కూతురు తమ ఇంట్లో అందరితో కలివిడిగా ఉండటం చూసి మనసుపడతాడు. వీరి ప్రేమను ఏబీఆర్ అంగీకరించడు. అప్పుడు ప్రశాంత్ ఓ చిక్కుముడి వేస్తాడు. దానికి సమాధానం వెతుక్కునే ప్రయత్నంలోనే థర్టీఇయర్స్ పృథ్విని పెట్టి 'తమలపాకూ అనే సినిమాను చేస్తాడు ఏబీఆర్. ఆ సినిమాలో మహేశ్ (బలిరెడ్డి పృథ్వీరాజ్), సమంత (సలోని) అనే పాత్రలు అందరికీ నచ్చుతాయి. ఆ సినిమాను తీసిన నిర్మాత తాతారావు(పోసాని కృష్ణ మురళి)కు, దర్శకుడు రోల్డ్ గోల్డ్ రమేశ్ (రఘు బాబు)కు మంచి పేరు వస్తుంది. ఇంత తతంగం తర్వాత ఏబీఆర్ తన కూతురు ప్రేమ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటాడు. అదేమిటన్నది మిగిలిన కథ.