ముంబై-చెన్నై రైలు మార్గం | |||
---|---|---|---|
అవలోకనం | |||
స్థితి | పనిచేస్తోంది | ||
లొకేల్ | మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు | ||
చివరిస్థానం | ఛత్రపతి శివాజీ టెర్మినస్
లోకమాన్య తిలక్ టెర్మినస్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను | ||
ఆపరేషన్ | |||
ప్రారంభోత్సవం | 1871 | ||
యజమాని | భారతీయ రైల్వేలు | ||
నిర్వాహకులు | మధ్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే | ||
సాంకేతికం | |||
లైన్ పొడవు | 1,281 కి.మీ. (796 మై.) | ||
ట్రాక్ గేజ్ | 5 ft 6 in (1,676 mm) బ్రాడ్ గేజి | ||
ఆపరేటింగ్ వేగం | 130 km/h (81 mph) | ||
అత్యధిక ఎత్తు | లోనావాలా 622 మీటర్లు (2,041 అ.) | ||
|
ముంబై-చెన్నై రైలు మార్గం, డెక్కన్ పీఠభూమి యొక్క దక్షిణ భాగం మీదుగా చెన్నై, ముంబైలను కలిపే రైలు మార్గం. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో 1,281 కిలోమీటర్లు (796 మై.) నడుస్తుంది. ముంబై-చెన్నై మార్గం డైమండ్ చతుర్భుజిలో ఒక భాగం.
1,281 కి.మీ. (796 మై.) -పొడవైన ఈ ట్రంక్ లైనులో కింది శాఖలున్నాయి:
భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుండి థానే వరకు 1853 ఏప్రిల్ 16 న గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే వేసిన ట్రాక్‌పై నడిచింది. GIPR లైన్ 1854లో కళ్యాణ్ వరకు, 1856లో పశ్చిమ కనుమల పాదాల వద్ద ఉన్న పాలస్దారి రైల్వే స్టేషన్ మీదుగా ఖోపోలి వరకు విస్తరించారు. భోర్ ఘాట్ మీదుగా నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు, GIPR 1858లో ఖండాలా - పూణే ట్రాక్‌ను ప్రజలకు తెరిచింది.
పలాస్దారి నుండి ఖండాలా వరకు కలిపే భోర్ ఘాట్1862లో పూర్తయింది. తద్వారా ముంబై పూణేలను కలుపింది. [1] 1860లలో రైల్వే ఇంజనీర్లకు పశ్చిమ కనుమలు పెద్ద అడ్డంకిగా నిలిచాయి. భోర్ ఘాట్ యొక్క శిఖరం (గతంలో భోరే ఘాట్ అని పిలుస్తారు) 2,027 అడుగుల వంపు ఉంది. "భోరే ఘాట్‌లో దాదాపు 4,000 గజాల పొడవు గల 25 సొరంగాలు ఉన్నాయి. భోరే ఘాట్‌లో మొత్తం 2,961 అడుగుల పొడవు గల ఎనిమిది ఎత్తైన వయాడక్ట్‌లు ఉన్నాయి. 7 నుండి 30 అడుగుల వరకు 22 వంతెనలు, వివిధ పరిమాణాల 81 కల్వర్టులు ఉన్నాయి." [2]
ముంబై-చెన్నై లైన్‌లోని పూణే-రాయచూర్ సెక్టారును దశలవారీగా తెరిచారు: పూణే నుండి బార్షి రోడ్ వరకు 1859లో, బార్షి రోడ్ నుండి మోహోల్ వరకు 1860లో, మోహోల్ నుండి షోలాపూర్ వరకు 1860లో తెరిచారు. 1865లో షోలాపూర్ నుంచి దక్షిణం వైపునకు వెళ్లే లైను పనులు ప్రారంభించి 1871లో రాయచూరు వరకు విస్తరించారు. ఆ విధంగా ఈ లైన్ మద్రాసు రైల్వే లైన్‌ను కలుసుకుని నేరుగా ముంబై-చెన్నై లింక్‌ను ఏర్పాటు చేసింది. [3]
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు, భారతదేశంలో మూడవ రైలు 1856లో మద్రాసు రైల్వే (MR) ద్వారా రాయపురం నుండి వాలాజా రోడ్ (ఆర్కాట్) వరకు నడీచింది. MR తన ట్రంక్ మార్గాన్ని బేపూర్ / కడలుండి (కాలికట్ సమీపంలో) వరకు విస్తరించింది. 1861లో అరక్కోణం నుండి ఉత్తర-పశ్చిమ శాఖలో పనిని ప్రారంభించింది. బ్రాంచ్ లైన్ 1862లో రేణిగుంటకు, [1] 1871లో రాయచూర్‌కు చేరుకుంది. ఇక్కడ ముంబై నుండి గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే లైన్‌కు అనుసంధానించబడింది. [3]
గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేస్ (GIPR) ద్వారా బాంబే విక్టోరియా టెర్మినస్, కుర్లాల మధ్య 1925 ఫిబ్రవరి 3 న 1.5 kV DCలో మొదటి ఎలక్ట్రిక్ రైలు నడవడంతో భారతదేశంలో రైల్వే విద్యుదీకరణ ప్రారంభమైంది. 1930 లో కళ్యాణ్-పుణె విభాగం [4] 1.5 kV DC ఓవర్ హెడ్ సిస్టమ్‌తో విద్యుదీకరించబడింది.
2013 మే 5 న కళ్యాణ్ నుండి ఖోపోలికిమ్ కళ్యాణ్ నుండి కసరకు గతంలో ఉపయోగించిన 1.5 కెవి డిసిని 25 కెవి ఎసిగా మార్చారు. [5] లోకమాన్య తిలక్ టెర్మినస్-థానే-కల్యాణ్ సెక్షన్‌లో 1.5 kV DC నుండి 25 kV ACకి మార్చడం 2014 జనవరి 12 న పూర్తయింది [6] CSMT నుండి LTT విభాగాన్ని 2015 న్ 8 న 1.5 kV DC నుండి 25 kV ACకి మార్చారు. [7] [8] కసర-పుణె సెక్షన్ కూడా 1.5 కెవి డిసి నుండి 25 కెవి ఎసికి మార్చబడింది.
పూణే-దౌండ్ విభాగం అలాగే దౌండ్-భిగ్వాన్ విభాగాలను 2017లో విద్యుదీకరించారు. [9] భిగ్వాన్-కలబుర్గి సెక్షన్ విద్యుదీకరణ మార్చి 2022 నాటికి పూర్తయింది [10] కలబుర్గి-వాడి సెక్షన్ను 2018లో విద్యుదీకరించారు. [11]
రేణిగుంట-నందలూరు సెక్టార్ విద్యుదీకరణ 2006 లో పూర్తయింది. [12] [13] నందలూరు-గుంతకల్ సెక్టారును 2013 డిసెంబరు నాటికి విద్యుదీకరించారు. [14] గుంతకల్-వాడి సెక్షన్ విద్యుదీకరణ 2015లో పూర్తయింది [15]
పురట్చి తలైవర్ డాక్టర్ MG రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్-తిరువళ్లూరు సెక్టార్, అలాగే బేసిన్ బ్రిడ్జ్-చెన్నై బీచ్ సెక్టార్లను 1979-80లో విద్యుదీకరించారు. తిరువళ్లు-అరక్కోణం సెక్టార్ 1982-83లో, అరక్కోణం-తిరుత్తణి సెక్టార్ 1983-84లో, తిరుత్తణి-రేణిగుంట సెక్టార్లను 1984-85లో విద్యుదీకరించారు. [16]
ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, కళ్యాణ్ ల మధ్య సాగే మార్గాన్ని 'గ్రూప్ A' లైన్‌గా వర్గీకరించారు. ఇక్కడ రైళ్లు 160 కిమీ/గం వేగంతో ప్రయాణించగలవు. కళ్యాణ్-పుణె-దౌండ్-వాడి మార్గం, వాడి-రాయచూర్-ఆదోని-అర్రకోణం- పురట్చి తలైవర్ డాక్టర్ MG రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ మార్గాలు 'గ్రూప్ B' లైన్‌లుగా వర్గీకరించబడ్డాయి. ఇక్కడ 130 కిమీ/గం వరకు వేగంతో ప్రయాణించవచ్చు.[17]
ఈ లైన్‌లో ఉన్న CST ముంబై, పూణే, షోలాపూర్, MGR సెంట్రల్ స్టేషన్లు భారతీయ రైల్వేల్లో అగ్రాన ఉన్న వంద బుకింగ్ స్టేషన్‌లలో ఉన్నాయి. [18]
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)