ముకుల్ చంద్ర గోస్వామి | |
---|---|
జననం | అసోం, భారతదేశం |
వృత్తి | సామాజిక కార్యకర్త |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం |
ముకుల్ చంద్ర గోస్వామి భారతీయ సామాజిక కార్యకర్త, అశాదీప్ అనే ప్రభుత్వేతర సంస్థ వ్యవస్థాపకుడు. ఇది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల కోసం గృహాలను నడుపడంతో పాటు వృద్ధులు, మానసిక రోగుల పునరావాసం కోసం పనిచేస్తుంది.[1] బ్యాంకర్ గా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, 1996లో తన ఇంటిలో సేవా కార్యకలాపాలతో సంస్థను స్థాపించిన గోస్వామి అనేక సంవత్సరాలుగా, మానసిక రోగుల కోసం రోష్మి అనే గృహాన్ని, మానసిక రోగులకు పునరావాసం కోసం నవ్చెత్న అనే ప్రాజెక్ట్ ను, వృద్ధుల కోసం డేకేర్ సెంటర్, బహిరంగ క్లినిక్ వంటి కార్యక్రమాలను ప్రారంభించాడు.[1][2] 2014లో భారత ప్రభుత్వం అతనిని నాలుగో అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించింది.[3]