ముక్తాబెన్ పంకజ్ కుమార్ డాగ్లీ (జననం 1962 జూలై 2) భారతదేశంలోని గుజరాత్ చెందిన సామాజిక కార్యకర్త. ఆమె అంధులు, వికలాంగుల కోసం పనిచేస్తుంది. ఆమె అనేక సంస్థలతో అనుబంధం కలిగి ఉంది. 2019లో ఆమెకు పద్మశ్రీ అవార్డు లభించింది.
డగ్లీ 1962 జూలై 2న గుజరాత్ లోని అమ్రేలీ సమీపంలోని నానా అంకాడియా గ్రామంలో జన్మించింది. ఏడు సంవత్సరాల వయస్సులో ఆమెకు మెనింజైటిస్ వ్యాధి సోకి ఆమె రెండు కళ్ళను కోల్పోయింది. ఆమె ప్రాథమిక విద్యను భావ్నగర్ ఉద్యోగ్ షాలా నుండి పొందింది. తరువాత ఆమె అహ్మదాబాద్ అంధ కన్య ప్రకాష్ గృహంలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకుంది. తరువాత ఆమె బి.ఎ, బి.యిడి పూర్తి చేసింది.[1][2] ఆమె 1984లో అమ్రేలిలోని అంధుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పంకజ్ కుమార్ డాగ్లీని వివాహం చేసుకుంది.[2][3]
ఆమె పన్నెండు సంవత్సరాలు అంధజన్ మండల్ (బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్) అమ్రేలీకి గౌరవ కార్యదర్శిగా పనిచేసింది. ఆమె అమ్రేలిలో అంధుల కోసం ఒక ప్రాథమిక పాఠశాలను స్థాపించింది. ఆమె నవచేతన్ అంధజన్ మండల్ కార్యనిర్వాహక సభ్యురాలు, నవజీవన్ అంధ్జన్ మండల్ భచౌ జాయింట్ సెక్రటరీ, అంధుల కోసం మహిళల సంఘం యొక్క అహ్మదాబాద్ లోని వంకనేర్ ట్రస్టీకి, సురేంద్రనగర్ లోని ప్రగ్నాచక్షు మహిళా సేవా కుంజ్ కార్యదర్శి, ఆమె అంధ మహిళల కోసం ద్వి-నెలవారీ బ్రెయిలీ పత్రిక దీదీని ప్రచురిస్తుంది.[2]
1996లో, ఈ జంట అంధ బాలికలకు సేవలు అందించే లాభాపేక్షలేని సంస్థ అయిన ప్రాగ్నాచక్షు మహిళా సేవా కుంజ్ ను స్థాపించారు.[4]
ఆమె చేసిన సామాజిక కృషికి గాను 2019లో భారత ప్రభుత్వం డగ్లికి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.[5][6] ఆమెకు 2015లో గాంధీ మిత్ర అవార్డు లభించింది.[7][3] ఆమె మాతా జిజాబాయి స్త్రీ శక్తి పురస్కారాన్ని కూడా అందుకుంది.[4]