![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ముత్యాలముగ్గు (1975 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | బాపు |
నిర్మాణం | మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు |
తారాగణం | శ్రీధర్ , సంగీత |
సంగీతం | కె.వి.మహదేవన్ |
గీతరచన | సి. నారాయణ రెడ్డి, గుంటూరు శేషేంద్ర శర్మ, ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | శ్రీరామ చిత్ర |
భాష | తెలుగు |
ముత్యాలముగ్గు 1975 లో బాపు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. బాపు దర్శకత్వం, ముళ్ళపూడి వెంకటరమణ మాటలు, ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణం, కోన సీమ అందాలు, తెలుగు భాష యాసలు - అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలు ముత్యంగా తెలుగువారికి అందజేశాయి. ఇది బాపు దర్శకత్వానికి ఒక మైలురాయి. రావు గోపాలరావు నటనలో ఒక కలికితురాయి.
ఈ చిత్రంలో ఉత్తర రామాయణం కథ అంతర్లీనంగా కనిపిస్తుంది. ఒక ధనికుల కుర్రాడు అనుకోకుండా ఒక పేదింటి పిల్లను పెళ్ళి చేసుకొంటాడు. ఆ జమీందారు ఆస్తిపై కన్నేసిన ఆ కుర్రాడి మేనమామ వారి సంసారాన్ని విడదీయడానికి ఒక గుమాస్తా (అల్లు రామలింగయ్య) తో కలిసి ఒక దళారీ (రావు గోపాలరావు - కంట్రాక్టరు)తో ఒప్పందం కుదుర్చుకొంటాడు. వారి కుట్ర వల్ల ఆ ఇల్లాలిని శంకించి ఆమెను భర్త దూరం చేసుకొంటాడు. ఆమె ఒక పూజారి ఇంట్లో తల దాచుకొని కవలలను కంటుంది. ఆ పిల్లలు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో విడిపోయిన తల్లిదండ్రులను కలుపుతారు.
దర్శకుడు: బాపు
సంగీతం: కె వి మహదేవన్
నిర్మాత: మద్దాలి వెంకటలక్ష్మీ నరసింహారావు
నిర్మాణ సంస్థ: శ్రీరామ చిత్ర
సాహిత్యం: సి నారాయణ రెడ్డి,ఆరుద్ర, గుంటూరు శేషేంద్ర శర్మ
నేపథ్య గానం:మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వి .రామకృష్ణ, పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ
ఛాయాగ్రహణం: ఇషాన్ ఆర్య
విడుదల:25:07:1975.
ఈ సినిమాలో పాటలకంటే సంభాషణలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. వాటిని తూర్పు గోదావరి యాసలో రావుగోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమై పోయింది.