మునగాల మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, మునగాల మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°03′00″N 79°50′00″E / 17.0500°N 79.8333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సూర్యాపేట జిల్లా |
మండల కేంద్రం | మునగాల (సూర్యాపేట జిల్లా) |
గ్రామాలు | 11 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 43,824 |
- పురుషులు | 22,326 |
- స్త్రీలు | 21,498 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.36% |
- పురుషులు | 67.56% |
- స్త్రీలు | 44.84% |
పిన్కోడ్ | 508233 |
మునగాల మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1] మునగాల, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కోదాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సూర్యాపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
లోగడ మునగాల మండలం,నల్గొండ జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మునగాల మండలాన్ని (1+10) 11 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, కోదాడ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 43,824 - పురుషులు 22,326 - స్త్రీలు 21,498