మురళి | |
---|---|
జననం | ఎస్.డి.మురళి 1964 మే 19 |
మరణం | 2010 సెప్టెంబరు 8 | (వయసు 46)
వృత్తి | నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1982–2010 |
ఎత్తు | 5 అ. 6 అం. (168 cమీ.) |
జీవిత భాగస్వామి | శోభా (m.1987–2010) |
పిల్లలు | కావ్య (1988) అథర్వ మురళీ (1989) ఆకాష్ మురళి (1992) |
తల్లిదండ్రులు | ఎస్. సిద్ధలింగయ్య ధనలక్ష్మి |
బంధువులు | ఎస్.డి.సురేష్ (తమ్ముడు),డేనియల్ బాలాజీ (పెద్దనాన్న కొడుకు) |
మురళి తమిళ, కన్నడ సినీ నటుడు. ఆయనను అక్కడి ప్రజలు 'పురట్చి నాయకన్' గా ముద్దుగా పిలుచుకుంటారు. మురళి నాన్న సీనియర్ డైరెక్టర్ ఎస్. సిద్ధలింగయ్య. మురళి తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో 70కి పైగా సినిమాల్లో నటించాడు.
మురళి 1964, మే 19న బెంగుళూరు లో జన్మించాడు. ఆయన తండ్రి సీనియర్ డైరెక్టర్ ఎస్. సిద్ధలింగయ్య, అమ్మ తమిళ కుటుంబానికి చెందిన వ్యక్తి. మురళికి తమ్ముడు సురేష్, చెల్లి శాంతి ఉన్నారు. ఆయన 5వ తరగతి వరకు చెన్నైలో, 6 - 10వరకు బెంగుళూరులో చదివాడు. 14 ఏళ్ల వయసులో తన తండ్రి ఎస్. సిద్ధలింగయ్య వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. కొన్నాళ్ళు ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాడు.
మురళికి ముగ్గురు పిల్లలు అథర్వ మురళి, కావ్య, ఆకాష్ మురళి[2]
మురళి 1982లో కన్నడ సినిమా "గెలువినా హిజ్జే" చిత్రం ద్వారా నటుడిగా సినీరంగంలోకి వచ్చాడు. ఆయన కన్నడంలో ప్రేమ పర్వ, బిల్లీ గులాబీ, అజేయ, ప్రేమ గంగే, ఠాయికొట్ట తలి, సంభవామి యుగే యుగే, అజయ్ -విజయ్ చిత్రాల్లో నటించిన అనంతరం తమిళంలో తొలిసారిగా 1983లో "పూవిళ్లంగా"[3] సినిమాలో నటించాడు. ఆయన చిత్రం "పగల్ నిలవు" ద్వారా మణిరత్నం దర్శకుడిగా, రేవతి నటిగా పరిచయమయ్యారు.
మురళి నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
ఆయన 2010, సెప్టెంబరు 8న గుండెపోటుతో మరణించాడు.[4][1]