![]() | |||||||||||||||
Personal information | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Nationality | భారతీయుడు | ||||||||||||||
Sport | |||||||||||||||
Sport | ఈత, జావెలిన్, షార్ట్ ఫుట్ | ||||||||||||||
Disability | అవును | ||||||||||||||
Medal record
|
మురళీకాంత్ పెట్కార్ భారతదేశానికి చెందిన పారాలింపిక్ క్రీడాకారుడు, భారత్ కి చెందిన వారిలో మొదటి పారాలింపిక్ బంగారు పతక విజేత. ఇతను 1972 వేసవి పారాలింపిక్స్‌లో జర్మనీలోని హైడెల్‌బర్గ్‌లో జరిగిన క్రీడలలో వ్యక్తిగత బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 50 మీటర్ల ఈత పోటీలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రీడలలో అతను జావెలిన్, ఖచ్చితమైన జావెలిన్ త్రో అలాగే స్లాలొమ్‌లలో కూడా పాల్గొన్నాడు . అతను మూడు ఈవెంట్‌లలో ఆఖరి రౌండుకు చేరుకున్నాడు. [1] 2018 లో, భారత ప్రభుత్వం ఇతనిని పద్మశ్రీ పురస్కారం తో సత్కరించింది. [2]
పెట్కార్ ఇండియన్ ఆర్మీలో కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (EME) లో ప్రైవేట్ లేదా జవాన్ గా పని చేసాడు . [3] 1965 లో పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో అతను తీవ్రస్థాయిలో బుల్లెట్ గాయాలకు గురయ్యాడు. [4] పెట్కర్ నిజానికి సికింద్రాబాద్ EME లో ఒక బాక్సర్. వికలాంగుడైన తర్వాత పెట్కార్ ఈత ఇంకా ఇతర క్రీడలలో పాల్గొనడం ప్రారంభించాడు. [5] 1968 వేసవి పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్‌లో పాల్గొన్నాడు, మొదటి రౌండ్‌లో ఉత్తీర్ణత సాధించాడు. ఇప్పటివరకు స్విమ్మింగ్‌లో నాలుగు పతకాలు సాధించాడు. తరువాత అతను పూణేలో TELCO ద్వారా ఉద్యోగం పొందాడు. [6]