మురసోలి మారన్ | |||
| |||
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1989 డిసెంబరు 2 – 1990 నవంబరు 10 | |||
ప్రధాన మంత్రి | వీపీ. సింగ్ | ||
---|---|---|---|
పదవీ కాలం 1999 – 2002 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | రామకృష్ణ హెగ్డే | ||
తరువాత | అరుణ్ శౌరీ | ||
పదవీ కాలం 1996 జూన్ 1 – 1998 మార్చి 19 | |||
ప్రధాన మంత్రి | హెచ్.డి. దేవే గౌడ ఐ.కె. గుజ్రాల్ | ||
లోక్ సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1996 – 2003 | |||
ముందు | ఎర ఆన్బరాసు | ||
తరువాత | దయానిధి మారన్ | ||
నియోజకవర్గం | చెన్నై సెంట్రల్ | ||
పదవీ కాలం 1967 – 1977 | |||
ముందు | సి.ఎన్. అన్నాదురై | ||
తరువాత | రామస్వామి వెంకటరామన్ | ||
నియోజకవర్గం | చెన్నై సెంట్రల్ | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1977 – 1995 | |||
నియోజకవర్గం | తమిళనాడు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిరుక్కువలై , మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు in తిరువరూర్ జిల్లా, తమిళనాడు), భారతదేశం) | 1934 ఆగస్టు 17||
మరణం | 2003 నవంబరు 23[1] [చెన్నై]], తమిళనాడు, భారతదేశం | (వయసు 69)||
రాజకీయ పార్టీ | ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) | ||
తల్లిదండ్రులు | తండ్రి: షణ్ముగసుందరం తల్లి : షణ్ముగసుందరి | ||
జీవిత భాగస్వామి | మల్లికా మారన్ | ||
బంధువులు | కావ్య మారన్ (మనవరాలు) | ||
సంతానం | కళానిధి మారన్ దయానిధి మారన్ ఆన్బుకరాసి | ||
నివాసం | చెన్నై, తమిళనాడు, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | పచైయప్పస్ కాలేజీ , మద్రాస్ లా కాలేజీ | ||
నవంబరు 23, 2003నాటికి |
మురసోలి మారన్ తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి. ఆయన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ సీనియర్ నాయకుడు.[2] ఆ పార్టీ వ్యవస్థాపక నేత, ఎం.కరుణానిధికి మేనల్లుడు. అయన 2003 నవంబరు 23లో ఆనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలో మరణించాడు.[3][4]
మురసోలి మారన్ 1934 ఆగస్టు 17లో షణ్ముగసుందరం, షణ్ముగసుందరి దంపతులకు తమిళనాడు రాష్ట్రం, తిరుక్కువలై గ్రామంలో జన్మించాడు. తల్లి షణ్ముగ సుందరి, డిఎంకె నాయకుడు కరుణానిధికి సోదరి. మారన్‌కు తల్లిదండ్రులు పెట్టిన పేరు త్యాగరాజ సుందరం. తరువాతి కాలంలో ఈ సంస్కృత పేరును మార్చుకుని అచ్చతమిళ పేరు మారన్ అని అతడే పెట్టుకున్నాడు.[5]
స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ఉన్నత చదువులకోసం మద్రాసు వెళ్ళాడు. చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో ఎంఏ (ఆర్ట్స్) పూర్తి చేశాడు.
మారన్ 1963లో మల్లికను వివాహమాడాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు - కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, సన్ నెట్ వర్క్ సీఈఓ కళానిధి మారన్ - ఒక కూతురు అన్బుకారసి మారన్ (కార్డియాలజిస్టు) ఉన్నారు.
ఆయన రాజకీయాల్లోకి రాకముందు కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశాడు. కరుణానిధి స్థాపించిన "మురసోలి" పత్రికకు సంపాదకుడుగా పనిచేసాడు. అప్పుడే తన పేరుకు ముందు మురసోలి అని తగిలించుకున్నాడు.[5]
మురసోలి మారన్ తమిళ సినిమాలకు స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. 5 చిత్రాలను నిర్మించి 2 చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
రాజకీయాలో డిఎంకె పార్టీ తరపున మారన్ కీలకమైన బాధ్యతలు నిర్వహించాడు. ఢిల్లీలో మారన్ ఆ పార్టీకి ప్రతినిధిగా ఉంటూ, పార్టీకు రాజకీయ పొత్తులు కుదర్చడంలో కీలకమైన పాత్ర నిర్వహించాడు. 1967 ఉండి అనేక పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[5]
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)