ముషీరాబాద్ | |
---|---|
నగరంలోని ప్రాంతం | |
Coordinates: 17°25′32″N 78°30′14″E / 17.425544°N 78.503795°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రో | హైదరాబాదు |
Named for | నవాబ్ అరస్తు జా, ముషీర్-ఉల్-ముల్క్ |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ | 500020 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ముషీరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ఒక వాణిజ్య కేంద్రం. ఇది సెంట్రల్ జోన్, హైదరాబాదు తొమ్మిదవ సర్కిల్ పరిధిలోకి వస్తుంది. సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇట్టెహాదుల్ ముస్లిమీన్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన నవాబ్ బహదూర్ యార్ జంగ్ ను ఈ ముషీరాబాద్‌లో ఖననం చేశారు.
ముషీరాబాదు మసీదుకు సంబంధించిన పాతభాగం కుతుబ్ షాహి కాలంలో నిర్మించబడింది.[1] తరువాత మసీదు, పరిసర ప్రాంతాలను నవాబ్ అరస్తు జా, ముషీర్-ఉల్-ముల్క్ (అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి) కు ఇవ్వడంతోపాటు అతని గౌరవార్థం ముషీరాబాద్ అని పేరు పెట్టారు.[2]
2003 వరకు ఈ ప్రాంతంలో ముషీరాబాద్ జైలు ఉండేది. దానిని కూల్చివేసి అదే ప్రాంతంలో తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రులలో ఒకటైన గాంధీ ఆసుపత్రి, గాంధీ వైద్య కళాశాల, నిర్మించబడ్డాయి.[3][4]
ముషీరాబాద్ చుట్టుపక్కల చిక్కడపల్లి, రామ్‌నగర్, కవాడిగూడ, దోమల్ గూడ, అశోక్‌నగర్, బాగ్ లింగంపల్లి, గాంధీనగర్, పార్సిగుట్ట, పద్మారావునగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.
ఇక్కడ అధిక సంఖ్యలో వైద్య విద్యార్థులు నివసిస్తున్నందువల్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్లు, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించబడ్డాయి. ఆసుపత్రి ఉండటం వల్ల ఇక్కడ అనేక డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లు, ఫార్మసీలు తమతమ శాఖలను ఏర్పాటుచేశాయి. హైదరాబాద్ మెట్రో రైలు నెట్‌వర్క్ ఆధ్వర్యంలో గాంధీ వైద్య కళాశాల సమీపంలో ప్రత్యేక స్టేషన్ నిర్మించబడింది.
తెలంగాణ శాసనసభలోని ఎన్నికల నియోజకవర్గాలలో ఒకటైన ఈ ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం[5] ప్రాంతంలో ప్రధానంగా పట్టు చీరల వ్యాపారాలు, తోళ్ళ శుద్ధి కర్మాగారములు ఉన్నాయి.[6][7] ప్రతి ఆదివారం రోడ్డు పక్కన పాత పుస్తకాలు దుకాణాలు ఏర్పాటుచేస్తారు.[8]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ముషీరాబాద్ మీదుగా నగరంలోని పలు ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషను, విద్యానగర్ రైల్వే స్టేషను, జామియా ఉస్మానియా రైల్వే స్టేషనుల నుండి ఇంటర్‌సిటీ, ఇంట్రాసిటీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు స్టేషన్లు కూడా ఇక్కడ ఉన్నాయి