మృణాళిని దేవి | |
---|---|
జననం | భవతారిణీ రాయ్ చౌదురి 1874 మార్చి 1 దాక్షిందిహి, బెంగాల్, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1902 నవంబరు 23 బెంగాల్, బ్రిటిష్ ఇండియా | (వయసు 28)
జాతీయత | బ్రిటిష్ ఇండియన్ |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 5 |
మృణాళిని దేవి (1874 మార్చి 1 - 1902 నవంబరు 23) బెంగాల్ కి చెందిన అనువాదకురాలు. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ భార్య. ఆమె జెస్సోర్ జిల్లాకు చెందినది, ఆమె తండ్రి ఠాగూర్ ఎస్టేట్‌లో పనిచేసేవారు. 1883లో, తొమ్మిదేళ్ల వయసులో, ఆమె ఠాగూర్‌ను వివాహం చేసుకుంది.
మృణాళినీ దేవి బ్రిటీష్ ఇండియాలో, బెంగాల్ ప్రెసిడెన్సీలో జెస్సోర్ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని ఖుల్నాలో ఉంది) ఫుల్టాలా గ్రామంలో బేనిమధోబ్ రాయ్ చౌదరి, దాక్షాయని దంపతులకు జన్మించింది. ఆమె ఖచ్చితమైన పుట్టిన తేదీ తెలియదు. జీవిత చరిత్ర రచయిత యొక్క ఒక అంచనా ప్రకారం, ఆమె 1 మార్చి 1874న జన్మించింది.[1] మరొకరు ఆమెకు 1872లో జన్మించి ఉండవచ్చని తెలిపారు. వివాహానికి ముందు మృణాళినీ దేవిని భవతారిణి అని పిలిచేవారు. అయితే, అది ఆమె అధికారిక పేరా లేదా మారుపేరా అనేది తెలియదు. ఆమె స్థానిక గ్రామ పాఠశాలలో ఒకటవ తరగతి వరకు చదువుకుంది. ఆమె తండ్రి ఠాగూర్ ఎస్టేట్‌లో పనిచేసేవాడు.[2]