మెక్సికోలో దాదాపు 800 భారతీయ కుటుంబాలు ఉన్నాయి, మొత్తం 900 మంది NRIలు ఉన్నారు . వారిలో ఎక్కువ మంది ఇటీవలే దేశానికి వచ్చినవారు. గ్వాడలజారా, క్వెరెటారో, మెక్సికో సిటీలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తరపున ఇటీవల వచ్చిన భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మెక్సికోలో పౌరసత్వం మంజూరుకు సంబంధించి వివక్ష లేని విధానం ఉంది. మెక్సికన్ జాతీయుడి జీవిత భాగస్వామి స్థానిక పౌరసత్వాన్ని పొందడంలో సాధారణంగా ఎలాంటి సమస్యను ఎదుర్కోరు. అయితే చాలా మంది ఎన్నారైలు మెక్సికన్‌లను వివాహం చేసుకున్నప్పటికీ, వారు తమ భారత పౌరసత్వాన్ని నిలుపుకున్నారు.
ఈ దేశంలో హిందువులు ప్రధానంగా వ్యాపారులు లేదా వృత్తిదారులు. వారిలో చాలామంది ఏదో ఒక అంతర్జాతీయ సంస్థ లేదా బహుళజాతి సంస్థలో పని చేస్తారు. [1] వారిలో కొందరు విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. వారు భారతదేశానికి, ఆతిథ్య దేశానికీ మధ్య మరింత పరస్పర అవగాహనను తీసుకురావడానికి సహాయపడతారు. ప్రస్తుతం, డాక్టర్ సంజయ్ రాజారామ్ (ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత) కూడా మెక్సికోలో ఉన్నాడు. అతను CIMMYTలో పని చేస్తున్నాడు. కొంతమంది భారతీయులు ISPAT మెక్సికానాలో పనిచేస్తున్నారు . [2] ఈ కంపెనీ లక్ష్మీ మిట్టల్ గ్రూప్‌లో భాగం. ట్రినిడాడ్‌లో మునిగిపోతున్న స్టీల్ కంపెనీని తిరిగి నిలబెట్టినందుకు గానూ ఈ కంపెనీ ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. [3] 1994-2000 మధ్యకాలంలో యాభై ఇతర వ్యాపార సంస్థలు ఈ దేశంలో US$1.58 బిలియన్ల పెట్టుబడులు పెట్టడంతో మెక్సికోలో భారతీయుల ఉనికి పెరిగింది. డయాస్పోరాలోని చాలా మంది సభ్యులు స్పానిష్ మాట్లాడతారు. విదేశీ వాతావరణానికి తగినట్లుగా తమను తాము మలచుకున్నారు.
మెక్సికో సిటీలో సంగం ఆర్గనైజేషన్ సాయిబాబా దేవాలయాన్ని, వైష్ణవ్ దేవాలయాన్నీ నిర్మించింది.
మెక్సికోలో ఇస్కాన్‌కు 8 కేంద్రాలు ఉన్నాయి. [4]
మెక్సికోలో ఇప్పుడు 29 సాయి కేంద్రాలు ఉన్నాయి.
మెక్సికోలో రెండు సాయి పాఠశాలలు ఉన్నాయి, ఒకటి చివావాలోను, మరొకటి క్యూర్నావాకాలోనూ ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో దాదాపు 100 మంది పిల్లలు ఉన్నారు. [5]