మెట్‌పల్లి | |
---|---|
Coordinates: 18°50′57″N 78°37′34″E / 18.8492°N 78.6261°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జగిత్యాల |
ప్రాంతం | దక్కన్ |
విస్తీర్ణం | |
• Total | 28.5 కి.మీ2 (11.0 చ. మై) |
• Rank | 3 |
జనాభా (2011)[1] | |
• Total | 50,092 |
• జనసాంద్రత | 1,800/కి.మీ2 (4,600/చ. మై.) |
భాష | |
• అధికార భాష | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 |
పిన్‌కోడ్ | 505325 |
Vehicle registration | TS–21 |
మెట్‌పల్లి, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలం లోని పురపాలక పట్టణం.[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [3] దీని పరిపాలన మెట్‌పల్లి పురపాలక సంఘం నిర్వహిస్తుంది. ఇది దాని స్వంత మెట్‌పల్లి రెవెన్యూ విభాగంలో ఉంది, ఇది కోరట్ల శాసనసభ నియోజకవర్గం లో భాగం. మెట్‌పల్లి హైదరాబాద్ నుండి 220 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి 63 గుండా మెట్‌పల్లి ద్వారా ఆర్మూర్ వద్ద జాతీయ రహదారి 44 కి కనెక్ట్ అవుతుంది. ఉత్తరాన గోదావరి నది 18 కి.మీ., శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ ప్రధాన కాలువ ద్వారా ప్రవహిస్తోంది.
ఈ పట్టణం ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. మొక్కజొన్న, పసుపు, పత్తి, పొద్దుతిరుగుడు, సహా పలు రకాల పంటలను పండిస్తారు.
ఇది జగిత్యాల జిల్లా లోని ఒక పురపాలకసంఘ పట్టణం. 2011 భారత జనాభా గణాంకాలు ప్రకారం మెట్‌పల్లె మున్సిపాలిటీలో 50,902 జనాభా ఉంది, అందులో 25,475 మంది పురుషులు, 25,427 మంది మహిళలు ఉన్నారు.
0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5325,ఇది మెట్‌పల్లి (M) మొత్తం జనాభాలో 10.46 %. మెట్‌పల్లి మున్సిపాలిటీలో, స్త్రీ లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 993కి వ్యతిరేకంగా 998గా ఉంది. పట్టణ అక్షరాస్యత రేటు 74.34 % ఎక్కువ. మెట్‌పల్లెలో పురుషుల అక్షరాస్యత దాదాపు 83.37% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 65.35%. మెట్‌పల్లి మున్సిపాలిటీలో మొత్తం 12,070 ఇళ్లకు పైగా పరిపాలన ఉంది,[4]
ఈ పట్టణానికి చెందిన కోట నరేష్, గౌతమిల కుమార్తె సిరి పన్నెండేళ్ల వయస్సులోనే 9 రకాల నృత్యాలతో 369 నిమిషాలపాటు నిర్విరామంగా నృత్యాలు చేసి ప్రపంచ రికార్డులను తన సొంతం చేసుకుంది.ఇందులో భారత్ వరల్డ్ రికార్డు, తెలుగు వరల్డ్ రికార్డు, తెలంగాణ వరల్డ్ రికార్డు, మెరాకిల్ గ్లోబల్ వరల్డ్ రికార్డ్సు, కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, హానర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అమేజింగ్ కిడ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పత్రాలు ఆయా సంస్థల నుంచి చిన్నారికి అందించి సత్కరించారు.
మెట్‌పల్లి పట్టణ ఖాదీ తయారీ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది. 1929లో మెట్‌పల్లిలో గాంధీజీ పేరిట భారీ కార్ఖానా స్థాపించగా, దేశ్‌ముఖ్ వెంకట నర్సింగరావు 14 ఎకరాల స్థలం అందజేశాడు. ఈ కార్ఖానా అభివృద్ధి చెంది స్వతంత్ర పోరాటానికి వేదికగా మారిపోయింది. ఇక్కడ తయారయిన ఖాదీ వస్ర్తాలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్మేవారు.[5] మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ 1967లో స్థాపించబడింది. ఈ సమాజం ద్వారా ఖాదీ షర్టులు, సూట్లు, లుంగీలు, తువ్వాళ్లు, చేతిరుమాళ్ళు, చీరలు, ధోవతులు, తివాచీలు మొదలైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందింది. ఇది 1970, 1980 వ దశకంలో అనేక వందల మంది వ్యక్తులకు జీవనోపాది కలిగిస్తుంది.
పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా ఈ గ్రామంలో నిర్మించిన 110 డబుల్ బెడ్ రూం ఇళ్ళను 2022, జూన్ 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఐటీ-మున్సిపల్ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించి, లబ్ధిదారులకు అందించాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బిసీ, మైనారిటీ, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6]