రకం | ప్రైవేటు వైద్య కళాశాల |
---|---|
స్థాపితం | 2002 |
ప్రధానాధ్యాపకుడు | డా. రణ్‌వీర్ సింగ్ |
స్థానం | ఘన్పూర్, మేడ్చల్, తెలంగాణ, భారతదేశం |
కాంపస్ | గ్రామీణ, 200 ఎకరాలు (40 ఎకరాలు కళాశాల) |
అనుబంధాలు | కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం |
మెడిసిటి వైద్య విజ్ఞాన సంస్థ (మిమ్స్) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ముప్పై కిలోమీటర్ల దూరంలోని మేడ్చల్ లో ఉన్న వైద్య కళాశాల.[1] ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది.
ఇది 1985లో స్థాపించబడిన ఒక ప్రభుత్వేతర సంస్థ సైన్స్ హెల్త్ అలైడ్-రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (షేర్) పరిధిలో ప్రారంభించిన తృతీయ-విద్యా సంస్థ.[2] ఇది 2002లో స్థాపించబడింది. 1992 నుండి ఘన్‌పూర్‌లో పనిచేస్తున్న 300 పడకల మల్టీ-స్పెషాలిటీ (కార్డియో-థొరాసిక్ స్పెషాలిటీ) మెడిసిటి హాస్పిటల్ ఈ మెడిసిటి వైద్య విజ్ఞాన సంస్థతో కలుపబడి, ప్జనరల్-ప్రాక్టీస్ సదుపాయంగా, కళాశాలకు బోధనా ఆసుపత్రిగా పనిచేస్తోంది.
భారత వైద్య మండలి 2020, ఆగస్టు 1న మొదటి బ్యాచ్‌కు అనుమతి ఇవ్వడంతో 2002, అక్టోబరు 17న 100 మంది విద్యార్థులతో 2002-2003 విద్యా సంవత్సరంను ఈ మెడిసిటి వైద్య విజ్ఞాన సంస్థ ప్రారంభించింది. తరువాత భారత వైద్య మండలి సిఫారసుతో భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2007 సంవత్సరం నుండి ఎంబీబీఎస్ డిగ్రీలను ప్రదానం చేసినందుకు మిమ్స్‌ను గుర్తించింది. 2012-13 విద్యా సంవత్సరం నుండి 100 నుండి 150 వరకు సీట్లు పెంచడానికి అనుమతులు వచ్చాయి. 2009లో ప్రీ, పారా, క్లినికల్ విభాగాలలో 50 సీట్లతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రారంభమయ్యాయి.
హైదరాబాదు నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో నాగ్‌పూర్ హైవే నెంబర్ 7లో పచ్చదనం, కొండలు, సరస్సుతో కూడిన మేడ్చెల్ గ్రామీణ ప్రాంతంలో 200 ఎకరాల్లో ఈ మెడిసిటి వైద్య విజ్ఞాన సంస్థ ప్రాంగణం ఉంది. ఇందులో 40 ఎకారాలు కళాశాల కోసం ఉపయోగించబడింది.[3]
కళాశాలలో బోధన, పరిశోధన, ఆసుపత్రి, రోగుల సంరక్షణ కోసం అన్ని సౌకర్యాలు ఉన్నాయి. డిగ్రీ కోర్సులు ఎనిమిది నాన్ క్లినికల్ విభాగాలు పూర్తి స్థాయి ప్రయోగశాలలు, ప్రపంచ స్థాయి లెక్చర్ హాల్స్, ఆడియో విజువల్ తోపాటు తగిన మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయి.
ఈ ప్రాంగణంలో కళాశాల వసతి గృహాలు, క్యాంటీన్లు, గ్రంథాలయం, వ్యాయామశాల, ఉద్యానవనం, ఆటస్థలం మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా, అనేక మంది విద్యార్థులు సమీప ప్రాంతాల నుండి, హైదరాబాదు నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యార్థి బస్సుల ద్వారా ప్రయాణం చేస్తారు.
ఇది నాలుగున్నర ఏళ్ళ కోర్సు, సెమిస్టర్ విధానం ఉంటుంది.
ఇది మూడు సంవత్సరాల కోర్సు.