మెహర్ రమేశ్ | |
---|---|
జననం | చిక్కాల మెహర్ రమేశ్ |
వృత్తి | చలనచిత్ర దర్శకుడు, రచయిత , నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2005 - ప్రస్తుతం |
మెహర్ రమేశ్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత, నటుడు.[1]
మెహర్ రమేశ్ కృష్ణా జిల్లా లోని విజయవాడలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు చిక్కాల కృష్ణమూర్తి (రిటైర్డు పోలీస్ ఇన్సిపెక్టర్).
మెహర్ రమేశ్, 2002లో విడుదలైన బాబీ చిత్రంలో మహేష్ బాబు స్నేహితుడిగా నటించాడు. 2004లో ఆంధ్రావాలా చిత్రాన్ని కన్నడంలో వీర కన్నడిగగా రిమేక్ చేసి దర్శకుడిగా మారాడు. 2008లో జూనియర్ ఎన్. టి. ఆర్ హీరోగా కంత్రితో తెలుగు సినిమారంగంలో దర్శకుడిగా అడుగుపెట్టాడు.[2]
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాచీ (2000), ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం (2001) వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా, పోకిరి (2006) చిత్రానికి సహా రచయితగా, దేశముదురు (2007) చిత్రంలో నటుడిగా చేశాడు. తను దర్శకత్వం వహించిన కంత్రి (2008), బిల్లా (2009) చిత్రాలలోని టైటిల్ పాటలను రాశాడు.
సంవత్సరం | చిత్రంపేరు | భాష | పాత్రపేరు |
---|---|---|---|
2002 | బాబీ | తెలుగు | సునీల్ (బాబీ స్నేహితుడు) |
సంవత్సరం | చిత్రంపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|
2004 | వీర కన్నడిగ | కన్నడ | ఆంధ్రావాలా రిమేక్ |
2006 | అజయ్ | కన్నడ | ఒక్కడు రిమేక్ |
2008 | కంత్రి | తెలుగు | |
2009 | బిల్లా | తెలుగు | |
2011 | శక్తి | తెలుగు | |
2013 | షాడో[3] | తెలుగు | |
2022 | భోళా శంకర్ | తెలుగు | [4] |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)