మేచకళ్యాణి రాగము (Mechakalyani) కర్ణాటక సంగీతంలో 65వ మేళకర్త రాగము.[1] ఇది ప్రతి మధ్యమ రాగములలో రాణి వంటిదని భావించే ప్రాచీన రాగము. ఈ రాగము పూర్వము కళ్యాణిగా పిలువబడేది. కటపయాది సంఖ్యలో యిముడుటకొరకు "మేచ" అను పదమును "కళ్యాణి" యందు అమర్చిరి. యిది రుద్ర అను చక్రములో ఐదవ రాగము.ఇది 29వ మేళకర్త రాగమైన ధీరశంకరాభరణం యొక్క ప్రతి మధ్యమ సమానము.
ఈ రాగంలో షడ్జమము, చతుశ్రుతి ఋషభము, అంతర గాంధారము, ప్రతి మధ్యమము, పంచమము, చతుశ్రుతి ధైవతము, కాకలి నిషాధము.
ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R2 G3 M2 P D2 N3 S)
అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N3 D2 P M2 G3 R2 S)
ప్రసిద్ధ ప్రతిమధ్యమ రాగము. చాల జన్యరాగ సంతతిగల జనకరాగము. ఈ రాగములో పా మా గా అనునపుడు గాంధారము అంతర గాంధారము లకు కొంచెము ఎక్కువగా నుండును. ఈ రకపు గాంధారమునకు తీవ్ర అంతర గాంధారము అని పేరు. దీనినే చ్యుత మద్యము అని చెప్పుటయూ ఉంది.
సర్వస్వర గనుక వరిక రక్తి రాగము. ఆరోహణావహరనములందలి అన్ని స్వరములు రాగ చ్ఛాయా స్వరములు. రిరి గగ మమ దద నిని, గగ మమ దద నిని, మమ దద నిని రిరి ఆరు జంట ప్రయోగములుని గా రిని, దని రిని ద మ, గని ద మగా రి అను దాటు ప్రయోగములు, ప్రసిద్ధ అలంకారములు, గగ దద నిని రి రి, దాని రిగా మ దని రి, ని ద మగా రిని సా - ఇవి విశేష సంచారములు. స్పరితము, త్రిపుచ్ఛము అను గమకములు మెండు. అన్ని రకముల రచనలు యిందు రచింపబడినవి. పెద్ద రాగము అన్ని వేళల పాడదగును. కాని సాయంసమయము సమంజసము.
క్రమ సంఖ్య | రచన | నామము | తాళము | రచయిత |
1 | గీతము | కమలజదల | త్రిపుట | --- |
2 | వర్ణము | వనజాక్షరో | ఆది | --- |
3 | వర్ణము | వనజాక్షి | ఆట | పల్లవి గోపాలయ్య |
4 | కృతి | నిధిచాల | చాపు | త్యాగరాజు |
5 | కృతి | నినువినా | ఆది | సుబ్బరాయశాస్త్రి |
6 | కృతి | తల్లీ నిన్ను నెర | మిశ్రలఘు | శ్యామశాస్త్రి |
7 | కృతి | కమలాంబాం | ఆది | ముత్తుస్వామి దీక్షితులు |
8 | కృతి | నిజదాసవరద | ఆది | పట్నం సుబ్రహ్మయ్యర్ |
9 | పదము | పారెంగుం | ఆది | ఘనం కృష్ణయ్య |
10 | పదము | ఎంతటి కులుకే | ఆది | పట్టాభిరామయ్య |
మేచకళ్యాణి రాగానికి చాలా జన్య రాగాలు ఉన్నాయి. వీనిలో హమీర్ కళ్యాణి, మోహన కళ్యాణి, సారంగ, సునదవినోదిన, యమన్ కళ్యాణి మొదలైనవి ప్రముఖమైనవి.
క్రమ సంఖ్య | రాగము పేరు | పాట | సినిమా పేరు |
1 | కళ్యాణి | అభినవతారవో | శివరంజని |
2 | కళ్యాణి | ఆకాశంలో హాయిగా రాగం తీసే కోయిల | కళ్యాణి |
3 | కళ్యాణి | అల వైకుంఠ పురంబులో | భక్తపోతన |
4 | కళ్యాణి | బహుదూరపు బాటసారి | ప్రైవేట్ పాట |
5 | కళ్యాణి | భూతల నందుడు రాముడు | వాగ్దానం |
6 | కళ్యాణి | చక్కనైన కోయరాజుని | జీవితం |
7 | కళ్యాణి | చల్లని వెన్నెలలో చక్కని కన్నె | సంతానం |
8 | కళ్యాణి | చెలికాడు నిన్నె రమ్మని పిలువా చేరరావేలా | కులగోత్రాలు |
9 | కళ్యాణి | చిగురులు వేసిన కలలన్నీ | పూలరంగడు |
10 | కళ్యాణి | దొరవో ఎవరివో | కథానాయకి మొల్ల |
11 | కళ్యాణి | దొరకునా యిటువంటి సేవ | శంకరాభరణం |
12 | కళ్యాణి | ఎక్కడి దొంగలు అక్కడనే గుప్ చిప్ | ఇల్లరికం |
13 | కళ్యాణి | ఏమని తెలుపుదురా | చిన్ననాటి స్నేహం |
14 | కళ్యాణి | ఎతవున్నారా నికకడ నీకు | వరుడు కావాలి |
15 | కళ్యాణి | ఎవరివో నీ వెవరివో... ఎవరివో నీ వెవరివో | పునర్జన్మ |
16 | కళ్యాణి | హాయిహాయిగా జాబిల్లి తొలిరేయి | వెలుగు నీడలు |
17 | కళ్యాణి | ఇది చిరు సరిగమలెరుగని | హై హై నాయకా |
18 | కళ్యాణి | జగమే మారినదీ మధురముగా ఈవేళ.. | దేశద్రోహులు |
19 | కళ్యాణి | జయ జయ జయ సుభసయ | మల్లీశ్వరి |
20 | కళ్యాణి | జయ జయ ప్రియ భారత | రాక్షసుడు |
21 | కళ్యాణి | జీవులను కాపాడుటకు దేవుడే ఉన్నాడు... దేవుని | రాము |
22 | కళ్యాణి | జోరు మీదున్నావు తుమ్మెదా... నీ జోడెవరికోసమే తుమ్మెదా.. | శివరంజని |
23 | కళ్యాణి | కలలు ఫలించే కాలములో | విమల |
24 | కళ్యాణి | కలిసిన హృదయాల లోన | ప్రేమనగర్ |
25 | కళ్యాణి | కన్నయ్య లాంటి అన్నయ్య లేని | బంగారు బాబు |
26 | కళ్యాణి | కనుగవ తానియయ | సువర్ణ సుందరి |
27 | కళ్యాణి | కనుల ముందు నీవుంటే కవితలల్లి పాడనా.. | చెల్లెలి కాపురం |
28 | కళ్యాణి | కనులు మాటలాడునని.. | చాణక్య |
29 | కళ్యాణి | కిల కిల నవ్వులు చిలికిన... | భార్యా భర్తలు |
30 | కళ్యాణి | కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్.. | దేవదాసు |
31 | కళ్యాణి | కులాసా రాదోయి రమ్మంటే | అన్నపూర్ణ |
32 | కళ్యాణి | కుండ కాదు కుండ | భాగ్యచక్రం |
33 | కళ్యాణి | లలిత లలిత మురళీ... | పాండురంగ మహత్యం |
34 | కళ్యాణి | మది శారదా దేవి మందిరమే... | జయభేరి |
35 | కళ్యాణి | మదిలోన మధుర భావం | జయసింహ |
36 | కళ్యాణి | మధుర భావాల సుమమాల | జైజవాన్ |
37 | కళ్యాణి | మగని ప్రాణంబు | ఆత్మమాలకు చూపు |
38 | కళ్యాణి | మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి | అందాల రాముడు |
39 | కళ్యాణి | మనసా త్రుళ్ళి పడకే, అతిగా ఆశపడకే... | శ్రీవారికి ప్రేమలేఖలు |
40 | కళ్యాణి | మనసేమిటో తెలిసిందిలే | అన్నపూర్ణ |
41 | కళ్యాణి | మనసు పాదింది సన్నాయి పాట... | పుణ్యవతి |
42 | కళ్యాణి | మనసులో ఒకటుంది | కులదైవం |
43 | కళ్యాణి | మనసున మల్లెల మాలలూగెనే | మల్లీశ్వరి |
44 | కళ్యాణి | మాతా మరకత శ్యామా | మహాకవి కాళిదాసు |
45 | కళ్యాణి | నాసరి నీవని నీ గురినీనని | సిఐడి |
46 | కళ్యాణి | నాదిరదిన్నా నచ్చిన దాని కోసం నా తపన | ఒకరికి ఒకరు |
47 | కళ్యాణి | నమ్మిన నామది మంత్రాలయమేగా.. | మంత్రాలయం |
48 | కళ్యాణి | నను బ్రోవమని చెప్పవే.. | రామదాసు |
49 | కళ్యాణి | నేడు శ్రీవారికి మేమంటే పరాకా అసలే... | ఇల్లరికం |
50 | కళ్యాణి | నీ నోము ఫ్లయించెనుగా | భూకైలాస్ |
51 | కళ్యాణి | నీవే ఆది దైవము | భక్త తుకారాం |
52 | కళ్యాణి | నిధి చాలా సుఖమా | త్యాగయ్య |
53 | కళ్యాణి | నిఖిల భువనపాల | ఇలవేలుపు |
54 | కళ్యాణి | ఓ దేవదా.. చదువూ ఇదేనా... | దేవదాసు |
55 | కళ్యాణి | ఓ నమో నమః | సూర్య ఐపిఎస్ |
56 | కళ్యాణి | ఓ సఖా రావోయి సఖా. | అనార్కలి |
57 | కళ్యాణి | వాడనా వాణి కళ్యాణిగా. | మేఘ సందేశం |
58 | కళ్యాణి | పాల కడలిపై శేష తల్పమున పవళించేవా దేవా... | చెంచు లక్ష్మి |
59 | కళ్యాణి | పలికెను ఏదో రాగం... | సంఘం చెక్కిన శిల్పాలు |
60 | కళ్యాణి | పల్లెకు పోదాం... | దేవదాసు |
61 | కళ్యాణి | పలుకురాదటే చిలుకల .. | షావుకారు |
62 | కళ్యాణి | పలుకవే రాణి. | స్వర్ణమంజరి |
63 | కళ్యాణి | పయనించే ఓ చిలుకా ఎగిరిపో .. | కులదైవం |
64 | కళ్యాణి | పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకొని | పెళ్ళీ చేసి చూడు |
65 | కళ్యాణి | పెను చీకటాయే లోకం... | మాంగల్యం |
66 | కళ్యాణి | పూవై విరిసిన పున్నమి వేళ... | తిరుపతమ్మ కథ |
67 | కళ్యాణి | ప్రియతమా... | ఆలీబాబా 40 దొంగలు |
68 | కళ్యాణి | పులకించని మది పులకించు.. | పెళ్ళి కానుక |
69 | కళ్యాణి | రా రా నా సామి రా రా | విప్రనారాయణ |
70 | కళ్యాణి | రాధను రమ్మన్నాడు | అర్థాంగి |
71 | కళ్యాణి | రాజా నా రాజా ఇటు చూడవోయి | శరణాగదర |
72 | కళ్యాణి | రాక రాక వచ్చావు చందమామ... | అర్థాంగి |
73 | కళ్యాణి | రామ రఘురామా అని పాడుతున్నా... | శ్రీ ఆంజనేయం |
74 | కళ్యాణి | రంగారు బంగారు చెంగావులు | లవకుశ |
75 | కళ్యాణి | రావె నా చెలియా నా జీవన నవ మాధురి నీవే. | మంచి మనసుకు మంచి రోజులు |
76 | కళ్యాణి | రావే రావే వయరి ఓ చెలియా... | కులదైవం |
77 | కళ్యాణి | సావిరహెతవ దీనా రాధా.. | విప్రనారాయణ |
78 | కళ్యాణి | సాగేను జీవిత నావ.. | తోబుట్టువు |
79 | కళ్యాణి | సఖియా వివరింపవే... | నర్తనశాల |
80 | కళ్యాణి | సలలిత రాగ సుధారస సారం | నర్తనశాల |
81 | కళ్యాణి | సరసాల జవరలను నేను. | సీతారామ కళ్యాణము |
82 | కళ్యాణి | సరి సరి నటనల ఓ చెలియా | మనోహరం |
83 | కళ్యాణి | శ్రీరామ నామాలు శతకోటి.... | మీరా |
84 | కళ్యాణి | తానే మారెనా గుణమే మారెనా.. | దెవదాసు |
85 | కళ్యాణి | తలనిండా పూదండ | ప్రైవేటు సాంగ్ |
86 | కళ్యాణి | తొలివలపే పాడే పిలిచే... | దేవత |
87 | కళ్యాణి | తోటలో నా రాజు తొంగి చూసెను నేడు... | ఏకవీర |
88 | కళ్యాణి | విరిసే చల్లని వెన్నెలా.. | లవకుశ |