మోతీ లాల్ ధర్ | |
---|---|
![]() | |
14వ బనారస్ హిందూ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ | |
In office 2 ఫిబ్రవరి 1977 – 15 డిసెంబరు 1977 | |
Appointed by | ఫకృద్దీన్ అలీ అహ్మద్ |
అంతకు ముందు వారు | కలూ లాల్ శ్రీమాలి |
తరువాత వారు | హరినారాయణ్ |
మోతీ లాల్ ధార్ (1914 అక్టోబరు 22 - 2002 జనవరి 20) భారతదేశంలో ప్రముఖ ఔషధ రసాయన శాస్త్రవేత్త, విజ్ఞాన శాస్త్ర నిర్వాహకుడు.[1] అతను 1960 నుండి 1972 లో పదవీ విరమణ చేసే వరకు లక్నో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టరుగా ఉన్నాడు. అతను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, బి. హెచ్. యు. వైస్ ఛాన్సలరుగా పనిచేసిన ఏకైక కాశ్మీరీ పండిట్.[2][3] 1971లో అతని సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.
మోతీ లాల్ ధర్ లండన్ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి (1940) చేసే సమయంలో మెడిసినల్ కెమిస్ట్రీ పై నైపుణ్యం సాధించాడు. అతను కాశ్మీర్‌లోని డ్రగ్ రీసెర్చ్ లాబొరేటరీకి (ప్రస్తుతం ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాల) చీఫ్ కెమిస్ట్ అయ్యాడు. అతను సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, లక్నో కు డైరక్టరుగా పనిచేసాడు. ఆ తర్వాత వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు.
ధార్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజమ్‌ల పై పరిశోధనలు చేసాడు; భారతదేశంలో ఔషధ మొక్కలు; సంతానోత్పత్తి నియంత్రణ; క్షయ, లెప్రసీ, అమీబియాసిస్, ఫైలేరియాసిస్, హెల్మెంథిక్ వ్యాధులతో సహా మైకోబాక్టీరియల్, ప్రోటోజోల్ ఇన్‌ఫెక్షన్‌ల కీమోథెరపీ; న్యూరో-కండరాల నిరోధించడం, హైపోగ్లైసీమిక్, హైపోటెన్సివ్ ఏజెట్స్ పై పరిశోధనలు చేసాడు[4].