మోత్కుపల్లి నర్సింహులు | |||
![]()
| |||
మాజీ మంత్రి
| |||
నియోజకవర్గం | ఆలేరు శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ | ||
నివాసం | హైదరాబాదు, తెలంగాణ | ||
మతం | హిందూ |
మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు. ఆయన సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) అభ్యర్థిగా ఆలేరు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.[1]
మోత్కుపల్లి నర్సింహులు 1983లో తొలిసారి ఆలేరు శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి సల్లూరు పోశయ్యపై గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మోత్కుపల్లి నర్సింహులు 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో టీడీపీలో చేరాడు. 1985లో ఆలేరు నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి చెట్టుపల్లి కెన్నెడీపై గెలిచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.నర్సింహులు 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పీవీ నరసింహారావు పై పోటీచేసి ఓడిపోయాడు.[2][3][4]
తెలంగాణ ఏర్పాటుపై టిడిపి అధ్యక్ష్యుడు చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనను వ్యక్తంచేయడంతో 2018, మే 28న తెలుగుదేశం పార్టీ నుండి మోత్కుపల్లిని బహిష్కరించారు.[5] మోత్కుపల్లి నర్సింహులు 2019 నవంబరు 4లో భారతీయ జనతా పార్టీలో చేరి,[6] 23 జూలై 2021న రాజీనామా చేశాడు.[7] మోత్కుపల్లి నర్సింహులు 2021 అక్టోబరు 18న తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు.[8] బీఆర్ఎస్ లో చేరిన అనంతరం పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 2023 అక్టోబరు 27న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[9][10]
సంవత్సరం | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|---|
1983 | ఆలేరు | ఎస్.సి రిజర్వడ్ | మోత్కుపల్లి నర్సింహులు | ఇండిపెండెంట్ | 26589 | సల్లూరు పోశయ్య | భారత జాతీయ కాంగ్రెస్ | 18914 | గెలుపు |
1985 | ఆలేరు | ఎస్.సి రిజర్వడ్ | మోత్కుపల్లి నర్సింహులు | తె.దే.పా | 49068 | చెట్టుపల్లి కెన్నెడీ | భారత జాతీయ కాంగ్రెస్ | 12922 | గెలుపు |
1989 | ఆలేరు | ఎస్.సి రిజర్వడ్ | మోత్కుపల్లి నర్సింహులు | ఇండిపెండెంట్ | 44953 | యాదగి బాసని సున్నం | తెలుగుదేశం పార్టీ | 32472 | గెలుపు |
1994 | ఆలేరు | ఎస్.సి రిజర్వడ్ | మోత్కుపల్లి నర్సింహులు | తెలుగుదేశం పార్టీ | 69172 | డా.కుడుదుల నగేష్ | భారత జాతీయ కాంగ్రెస్ | 30197 | గెలుపు |
1999 | ఆలేరు | ఎస్.సి రిజర్వడ్ | మోత్కుపల్లి నర్సింహులు | భారత జాతీయ కాంగ్రెస్ | 55384 | డా.కుడుదుల నగేష్ | తెలుగుదేశం పార్టీ | 47767 | గెలుపు |
2004 | ఆలేరు | ఎస్.సి రిజర్వడ్ | డా.కుడుదుల నగేష్ | తెలంగాణ రాష్ట్ర సమితి | 66010 | మోత్కుపల్లి నర్సింహులు | తె.దే.పా | 41185 | ఓటమి |
2008 | ఆలేరు (ఉప ఎన్నికలు) | ఎస్.సి రిజర్వడ్ | డా.కుడుదుల నగేష్ | తెలంగాణ రాష్ట్ర సమితి | 45867 | మోత్కుపల్లి నర్సింహులు | తెలుగుదేశం పార్టీ | 41943 | ఓటమి |
2009 | తుంగతుర్తి | ఎస్.సి రిజర్వడ్ | మోత్కుపల్లి నర్సింహులు | తెలుగు దేశం పార్టీ | 80888 | గెలుపు | |||
2014 | మధిర | (ఎస్.సి) | మల్లు భట్టివిక్రమార్క | భారత జాతీయ కాంగ్రెస్ | N.A | మోత్కుపల్లి నర్సింహులు | తెలుగుదేశం పార్టీ | N.A | ఓటమి |
2018 | ఆలేరు | జనరల్ | గొంగిడి సునీత | తెలంగాణ రాష్ట్ర సమితి | మోత్కుపల్లి నర్సింహులు | బహుజన లెఫ్ట్ ఫ్రంట్ | ఓటమి |