మోరగుడి వైఎస్‌ఆర్ జిల్లా, జమ్మలమడుగు మండలానికి చెందిన జనగణన పట్టణం.[1]
మొరగుడి వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగు మండలంలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం, మొరగుడి నగరంలో మొత్తం 1,779 కుటుంబాలు నివసిస్తున్నాయి. మొరగుడి మొత్తం జనాభా 6,812, అందులో 3,382 మంది పురుషులు, 3,430 మంది స్త్రీలు ఉన్నారు.లింగ నిష్పత్తి 1,014. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 688, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య 353 మంది మగ పిల్లలు, 335 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఆ విధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం మొరగుడిలోని బాలల లింగ నిష్పత్తి 949, ఇది సగటు లింగ నిష్పత్తి (1,014) కంటే తక్కువ.అక్షరాస్యత రేటు 66.9%. ఆ విధంగా వైఎస్ఆర్ జిల్లాలో 67.3% అక్షరాస్యతతో పోలిస్తే మొరగుడి తక్కువ అక్షరాస్యతను కలిగి ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 79.07% , స్త్రీల అక్షరాస్యత రేటు 54.93%.[2]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]
- శ్రీ చౌడేశ్వరీ, చౌడేశ్వరుల ఆలయం - ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2013, అక్టోబరు-5న, ప్రత్యేకపూజలు నిర్వహించారు. గంగాపూజ, పూర్ణబింబోత్సవం, గణపతి పూజ, అగ్నిప్రతిష్ఠ నిర్వహించారు. 6 అక్టోబరున ప్రత్యేకపూజలు చేసి, 7 అక్టోబరునాడు విగ్రహప్రతిష్ఠ జరిగింది.[3]
- శ్రీకృష్ణానందమఠం -మోరగుడి సమీపంలో రూపు దిద్దుకుంటున్న శ్రీకృష్ణానందమఠం, ప్రజలలో ఆధ్యాత్మికభావాన్ని పెంపొందిస్తున్నది. హైదరాబాదుకి చెందిన ఈ సంస్థ ఆధ్వర్యంలో, 2001 డిసెంబరు 5 నాడు ఈ మఠం పనులు మొదలు పెట్టింది. ఆధ్యాత్మిక పరిశోధనా కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్ర నిర్మాణం పూర్తికావస్తున్నది. ఈ మఠం కోసం, ప్రొద్దుటూరుకి చెందిన ప్రముఖవైద్యులు సుందరరామిరెడ్డి, 2.30 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చారు.
ఈ మఠంలోని విశేషాలు
- రు.3కోట్లతో గీతోపదేశం దృశ్యం భవన నిర్మాణం.
- రథం ప్రక్కన 40 అడుగుల ఎత్తయిన గోపాలకృష్ణ విగ్రహం.
- దీని వెనుక కాళీయమర్దనం దృశ్యం.
- ఈశాన్యపు కొలనులో వటపత్రశాయి దృశ్యం
- మానవదేహం స్ఫూర్తితో 9 మంటపాల నిర్మాణం. దీనిని ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా విస్తరించేటందుకు సన్నాహాలు చేస్తున్నారు.[4]
- శ్రీ దత్తసాయి దేవాలయం - ఈ ఆలయ నవమ వార్షికోత్సవం, 2016, అక్టోబరు-29 న శనివారంనాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆ రోజున ఉదయం 11 గంటలనుండి అన్నసమారాధాన కార్యక్రమం నిర్వహించారు.[5]
మోరగుడి గ్రామంలో వేరుశనగ పంట, జొన్న పంట, పత్తి పంట, పొద్దు తిరుగుడు పంట, వరి పంట, మెుదలగు పంటలు పండించుదురు. మా గ్రామంలో ఇంకా చాల పంటలు పండించుదురు
చేనేత, వ్యవసాయం
- ఈ గ్రామం చేనేత పరిశ్రమకు జిల్లాలో పేరు గాంచింది. ఈ గ్రామం జమ్మలమడుగు పట్టణానినకి అతి సమీపంలో ఉంది. ప్రస్తుతం జమ్మలమడుగు పట్టణంలో దాదాపు కలిసిపోయింది.
- ఈ గ్రామానికి చెందిన బయొలాజికల్ సైన్స్ అధ్యాపకులైన హసిం బాషాకు, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, డాక్టరేటు ప్రదానం చేసింది.ఇతను జువాలజీ విభాగంలో "karika papayaalin Extraction on Reproduction Metabolic Activities Male Alchin Reeves" అను అంశంపై చేసిన పరిశోధనకు ఈ డాక్టరేటు ప్రదానం చేసారు.[6]