మోసగాళ్ళు | |
---|---|
![]() మోసగాళ్ళు సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | జెఫ్రీ గీ చిన్ |
రచన | మంచు విష్ణు |
నిర్మాత | మంచు విష్ణు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | షెల్డన్ చౌ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | సామ్ సి.ఎస్ |
నిర్మాణ సంస్థలు | ఏవిఏ ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ |
విడుదల తేదీs | 19 మార్చి, 2021[1] |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు ఇంగ్లీష్ |
బడ్జెట్ | ₹51 కోట్లు |
మోసగాళ్ళు, 2021 మార్చి 19న విడుదలైన తెలుగు సినిమా. ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లలో మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమాకి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించాడు. ఇందులో విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, రూహి సింగ్, నవదీప్, నవీన్ చంద్ర, కర్మ మెక్కెయిన్ తదితరులు నటించారు. సాంకేతిక కుంభకోణాలకు సంబంధించిన నిజమైన సంఘటనల ఆధారంగా[2] తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఈ సినిమా రూపొందింది.[3]
తరాల మధ్య; తూర్పు పడమర మధ్య; ధనిక పేద మధ్య భారతదేశంలో కాల్ సెంటర్ కుంభకోణంలో భారతీయ ఐటి పరిశ్రమను కదిలించిన, 380 మిలియన్ డాలర్లు (2,800 కోట్లు) సంపాదించిన నిజమైన సంఘటనల ఆధారంగా[4] ఈ సినిమా రూపొందింది. ఈ కుంభకోణంలో మిలియన్ డాలర్ల యుఎస్ పన్ను చెల్లింపుదారుల డబ్బు కొల్లగొట్టబడుతుంది.[5]
2019, జూన్ లో షూటింగ్ ప్రారంభమైంది.[13] ఈ సినిమా 2020, జూన్ 5న విడుదలకావాల్సి ఉంది. కాని కరోనా-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా ₹51 కోట్ల (US $ 7 మిలియన్) బడ్జెట్‌తో నిర్మించబడింది. ఇది విష్ణు కెరీర్‌లో అత్యంత ఖరీదైన సినిమాగా నిలిచింది.[14]
ఈ సినిమా 2021, మార్చి 19న విడుదలైంది.[15] ఈ సినిమాను హిందీ, తమిళం, కన్నడం, మలయాళ డబ్ వెర్షన్లలో విడుదల చేయనున్నారు.[16]