మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ | |
---|---|
దర్శకత్వం | భాస్కర్ |
రచన | భాస్కర్ |
నిర్మాత | బన్నీ వాసు వాసు వర్మ అల్లు అరవింద్ (సమర్పణ) |
తారాగణం | అఖిల్ అక్కినేని పూజా హెగ్డే |
ఛాయాగ్రహణం | ప్రదీష్ వర్మ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | జీఏ2 పిక్చర్స్ |
విడుదల తేదీ | 15 అక్టోబర్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తెలుగులో విడుదలైన రొమాంటిక్ కామెడీ ప్రేమ కథ సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మించిన ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించాడు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ఆమని, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలై[1], నవంబర్ 19న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.[2]
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా షూటింగ్ జులై 2019లో హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన ‘మనసా మనసా’ పాటను 2 మార్చి 2020న విడుదల చేశారు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ ను మార్చి 2020లో ఆపేసి తిరిగి సెప్టెంబర్ 2020లో షూటింగ్ ప్రారంభించారు.ఈ సినిమా టీజర్ ను 25 అక్టోబర్ 2020న, గుచ్చే గులాబీ పాటను ఫిబ్రవరి 13, 2021న,[3] ‘ఏ జిందగీ’ లిరికల్ పాటను ఏప్రిల్ 5,[4] 2021న విడుదల చేశారు.
హర్ష (అఖిల్) న్యూయార్క్ లో ఉద్యోగం చేస్తూ పెళ్లిచూపుల కోసం ఇండియాకి వస్తాడు. ఈ క్రమంలో 20 సంబంధాలలో విభ (పూజా హెగ్డే) ఒక స్టాండ్ కమెడియన్ గా కూడా ఉంటుంది, కానీ వారి జాతకాలు కలవని కారణంగా పెళ్లి కుదరదు. హర్ష అనుకోని పరిస్థితుల్లో విభతో ప్రేమలో పడతాడు, కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల అతను మళ్ళీ అమెరికాకు వెళ్లి పోతాడు. విభకి కూడా హర్ష పైన నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత హర్ష మనసు మారిపోతుంది. ఆ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన అతను విభను కలిశాడా ? ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం చేసుకున్నాడా ? అనేదే మిగతా సినిమా కథ.[5]
1:లేహరాయి , రచన: శ్రీమణి ,గానం.సిద్ శ్రీరామ్
మనసా మనసా , రచన: సురేంద్ర కృష్ణ , గానం.సిద్ శ్రీరామ్
2:గుచ్చే గులాబీ , రచన: అనంత్ శ్రీరామ్, శ్రీమణి , గానం.అర్మన్ మాలిక్
3:ఏ జిందగీ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.హనిఫా నాఫిస
4:చిట్టి అడుగు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.జియాఉల్హక్
2021 సైమా అవార్డులు (తెలుగు)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link)