మోహన్ లాల్ చతుర్భుజ్ కుమార్ | |
---|---|
బాల్య నామం | మోహన్ లాల్ కుమార్ |
జననం | మొలెలా , రాజస్థాన్, భారతదేశం | 1939 ఫిబ్రవరి 4
మరణం | 2023 జూలై 7 | (వయసు: 84)
అవార్డులు | పద్మశ్రీ |
మోహన్ లాల్ చతుర్భుజ్ కుమార్ రాజస్థాన్కు చెందిన శిల్పి. టెర్రకోట శిల్పకళలో తన నైపుణ్యాలకు గాను 2003లో ఆయన శిల్ప గురు పురస్కారాన్ని గెలుచుకున్నాడు. 1939లో జన్మించిన అతను నాథద్వార లో నివసిస్తున్నాడు. 23వ సూరజ్‌కుండ్ క్రాఫ్ట్స్ మేళాలో రాజస్థాన్ కు చెందిన మోహన్ లాల్ చతుర్భూజ్ టెర్రకోటలో చేసిన కృషికి కళామణి పురస్కారాన్ని అందుకున్నాడు. స్పెయిన్, యుఎస్ఎ, ఆస్ట్రేలియా వంటి వివిధ దేశాలలో ఈ సాంప్రదాయ కళను ప్రోత్సహించడంలో ఆయన పాల్గొన్నాడు. భారత ప్రభుత్వం 2012లో ఆయనకు పద్మశ్రీ పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది.[1]