యమలీల 2 | |
---|---|
యమలీల 2 | |
దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
నిర్మాత | డా. కెవి. సతీష్ కె. అచ్చిరెడ్డి |
తారాగణం | డా. కెవి సతీష్ దియా నికోలస్ మోహన్ బాబు బ్రహ్మానందం |
సంగీతం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థ | కృష్వి ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 28 నవంబరు 2014 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
యమలీల 2 2014, నవంబరు 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. కృష్వి ఫిల్మ్స్ పతాకంపై డా. కెవి. సతీష్, కె. అచ్చిరెడ్డి నిర్మాణ సారథ్యంలో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా. కెవి సతీష్, దియా నికోలస్, మోహన్ బాబు, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రల్లో నటించగా, ఎస్.వి. కృష్ణారెడ్డి సంగీతం అందించాడు.[1]
యమలోకంలో యముడు (మోహన్‌బాబు) గాంధర్వ కన్య పాటలు పాడుతుంటే పరవశిస్తాడు. అది భూలోకంలోని మానస సరోవరం నుంచి వస్తుందని చిత్రగుప్తుడు(బ్రహ్మానందం) చెప్పడంతో కిందకి వస్తారు. వస్తూ భవిష్యవాణి గ్రంథాన్ని తెస్తారు. ఇక వీరిని చూసి గంధర్వ కన్యలు పారిపోతారు. యముడు సరోవరంలో సేదతీరుతానని చెప్పి 10 రోజుల వరకు రాడు. దీంతో బయట వున్న చిత్రగుప్తుడు వుండలేక... నీటిలోకి భవిష్యవాణిని తీసుకెళ్ళలేక అక్కడే వున్న ఒకేఒక్క మానవుడుని పిలిచి గ్రంథాన్ని ఇస్తాడు. దాన్ని తెరవకూడదంటాడు. కానీ ఆ తర్వాత వుండబట్టలేక అతను తెరిచి చూసి భయంభ్రాంతులవుతాడు. కాసేపటికి పైకి వచ్చిన వారికి మానవుడు కన్పించడు. అతనికోసం గాలిస్తూ.. అతన్ని తెలుసుకుని గ్రంథాన్ని ఇవ్వమంటే.. ఓ షరతు పెడతాడు. అది ఏమిటి? అనేది మిగిలిన సినిమా.[2]
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)