యమునోత్రి ఆలయం | |
---|---|
![]() యమునోత్రి ఆలయం, ఆశ్రమాలు | |
స్థానం | |
దేశం: | ![]() |
రాష్ట్రం: | ఉత్తరాఖండ్ |
జిల్లా: | ఉత్తరకాశీ |
ఎత్తు: | 3,291 మీ. (10,797 అ.) |
భౌగోళికాంశాలు: | 31°1′0.12″N 78°27′0″E / 31.0167000°N 78.45000°E |
చరిత్ర | |
నిర్మాత: | నరేష్ ప్రతాప్ షా |
వెబ్‌సైటు: | [1] |
యమునోత్రి ఆలయం అనేది గర్హ్వాల్ హిమాలయాల పశ్చిమ ప్రాంతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలో 3,291 మీటర్లు (10,797 అ.) ఎత్తులో ఉన్న దేవాలయం. ప్రధాన జిల్లా కేంద్రమైన ఉత్తరకాశీ నుండి 129 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ దేవాలయంలో యమునా దేవి కొలువై ఉంది. ఇక్కడ యమునాదేవి నల్ల పాలరాతి విగ్రహం ఉంది.
హనుమాన్ చట్టి నుండి యమునోత్రికి వెళ్ళేటపుడు అనేక జలపాతాల దృశ్యాలను చూడవచ్చు. హనుమాన్ చట్టి నుండి యమునోత్రికి రెండు ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి, ఒకటి కుడి ఒడ్డున ఉన్న మార్కండేయ తీర్థం మీదుగా వెళుతుంది, మార్కండేయ ఋషి మార్కండేయ పురాణాన్ని రచించాడు, నది ఎడమ ఒడ్డున ఉన్న మరొక మార్గం ఖర్సాలి మీదుగా వెళుతుంది. యమునోత్రికి ఐదు లేదా ఆరు గంటలు ఎక్కాలి.[1]
యమునోత్రి దేవాలయంలో యమునాదేవి అమ్మవారు కొలువై ఉన్నది. గంగోత్రిలో 18వ శతాబ్దంలో గర్వాల్ నరేష్ ప్రతాప్ షా నిర్మించిన ఒక దేవాలయం కూడా ఉంది. 19వ శతాబ్దంలో పుననిర్మించబడింది.[2] ఈ దేవాలయం పునర్నిర్మాణానికి ముందు మంచు, వరదల కారణంగా రెండుసార్లు ధ్వంసమైంది. చార్ ధామ్ తీర్థయాత్ర సర్క్యూట్‌లో ఈ దేవాలయం కూడా భాగంగా ఉంది.
ప్రతి సంవత్సరం మే నెలలో అక్షయ తృతీయ[3] నాడు తెరవబడుతుంది, శీతాకాలం కోసం యమ ద్వితీయ (దీపావళి తర్వాత రెండవ రోజు) నాడు మూసివేయబడుతుంది.[4] యమునోత్రి వద్ద 3,292 మీటర్లు (10,801 అ.) ఎత్తులో అలసిపోయిన యాత్రికులకు ఉపశమనాన్ని అందించేందుకు సూర్య కుండ్ (వేడినీటిని కలిగి ఉంటుంది), గౌరీ కుండ్ (స్నానానికి అనుకూలమైన గోరువెచ్చని నీటిని కలిగి ఉంది) అనే రెండు వేడినీటి గుండాలు కూడా ఉన్నాయి.[1] దేవాలయంలోనే బసచేయడానికి కొన్ని చిన్న ఆశ్రమాలు, అతిథి గృహాలు ఉన్నాయి. ప్రసాదం తయారు చేయడం, పంపిణీ చేయడం, పూజల పర్యవేక్షణ వంటి ఆచార విధులు పూజారులచే నిర్వహించబడతాయి.