యాకుత్‌పురా
పాతబస్తీ, హైదరాబాదు | |
---|---|
నగరంలోని ప్రాంతం | |
Coordinates: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
జనాభా | |
• Total | సుమారు 6 లక్షలు (6,00,000) |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500023 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | యాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
యాకుత్‌పురా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1][2] ఇది పాతబస్తీలో భాగంగా ఉంది.[3]
యాకుత్‌పురా అనే పదం యాకుట్ అనే పర్షియన్ పదం నుండి వచ్చింది. పర్షియన్ భాషలో యా · కుట్ అంటే విలువైన రాయి "రూబీ" అని అర్థం. హైదరాబాద్ నిజాం రాజు ఈ పేరు పెట్టాడు. హైదరాబాదు ముత్యాల నగరంగా పేరుగాంచింది. 7వ నిజాం (మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్) కాలంలో హైదరాబాదు నగరం రత్నాలు, ముత్యాలకు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందింది. అందులో యాకుత్‌పురా ఒకటి.
ఈ ప్రాంతం, చారిత్రాత్మక చార్మినార్, మక్కా మసీదుల నుండి 2 కి.మీ.ల దూరంలో ఉంది. పాత నగరంలోని అతిపెద్ద ప్రాంతాలలో ఒకటైన యాకుత్‌పురాలో మాదన్నపేట, మీర్ ఆలం మండి వంటి కూరగాయల మార్కెట్లు ఉన్నాయి. సమీపంలోని లాడ్ బజార్, పత్తర్ గట్టి ప్రాంతాలలో అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి. ఇది డబీర్‌పూర్ వంతెన ద్వారా డబీర్‌పూర్కు కలుపబడివుంది.[4]
యాకుత్‌పురా ప్రాంతం హైదరాబాద్ సౌత్ జోన్ పరిధిలోకి వస్తుంది. సౌత్ జోన్ లో చార్మినార్, పత్తర్‌గట్టి, అఫ్జల్‌గంజ్, శాలిబండ, ఫలక్‌నుమా, డబీర్‌పురా, యాకుత్‌పురా, పురాణి హవేలీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని చాలా ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలు ఈ సౌత్ జోన్ పరిధిలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఓల్డ్ సిటీ లేదా పురానా షహర్ అని కూడా పిలుస్తారు. సౌత్ జోన్ హైదరాబాద్‌లోని అత్యంత ఉల్లాసమైన, ప్రామాణికమైన షాపింగ్ అనుభవానికి నిలయంగా ఉంది. యాకుత్‌పురా నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కాగా, ప్రస్తుతం అహ్మద్ పాషా క్వాద్రీ ఎమ్మెల్యేగా ఉన్నాడు.
యాకుత్‌పురాలో చాలా తక్కువ, పరిమిత విద్యాసంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఇస్లామియా మహిళా డిగ్రీ కళాశాల ఉంది.
ఈ ప్రాంతంలో క్లినిక్‌లు ఉన్నాయి. పురాతన పిల్లల ఆసుపత్రి "ప్రిన్సెస్ దుర్రే షావర్ పిల్లల కంటి ఆసుపత్రి", మొఘల్‌పురాలోని ప్రిన్సెస్ ఎస్రా ఆసుపత్రి, చాంద్రాయణగుట్టలోని ఒవైసీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి మొదలైనవి ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.
ఇక్కడ "యాకుత్ మహల్ డీలక్స్" అనే పురాతన సినిమా థియేటర్ ఉంది. ఇందులో పాత హిందీ సినిమాలను చూడవచ్చు. మరొక థియేటర్ సూరజ్ టాకీస్ చాలాకాలంక్రితమే మూసివేయబడి, ఇప్పుడు ఫంక్షన్ హాల్ గా మార్చబడింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో యాకుత్‌పురా మీదుగా నగరంలోని వంటి ప్రాంతాలకు బస్సు (బస్సులు నెంబర్లు 82, 77) సౌకర్యం ఉంది.[5] ఇక్కడ యాకుత్‌పురా రైల్వే స్టేషను ఉంది.
{{cite web}}
: CS1 maint: url-status (link)