యాసిర్ అరాఫత్ సత్తి (2009) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | యాసిర్ అరాఫత్ సత్తి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | రావల్పిండి, పంజాబ్, పాకిస్తాన్ | 1982 మార్చి 12|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | Yas | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 9 అం. (175 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 189) | 2007 డిసెంబరు 8 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2009 మార్చి 1 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 130) | 2000 ఫిబ్రవరి 13 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2009 మే 3 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 27 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 19) | 2007 సెప్టెంబరు 2 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2012 సెప్టెంబరు 30 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1997–present | Rawalpindi | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1999–2000 | Pakistan Reserves | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000–2007 | ఖాన్ రీసెర్చ్ లాబొరేటరీస్ క్రికెట్ టీమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004–2005 | Scotland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005–2006 | పాకీ నేషనల్ బ్యాంక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006, 2009–2010, 2014 | ససెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007–2008 | కెంట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–2010 | Otago | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | సర్రే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | Barisal Burners | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | లాంకషైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | కాంటర్బరీ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | సోమర్సెట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013–2015 | Perth Scorchers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2016 | హాంప్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | → సోమర్సెట్ (on loan) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2019 నవంబరు 9 |
యాసిర్ అరాఫత్ సత్తి (జననం 1982 మార్చి 12) పాకిస్తానీ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. ఆల్ రౌండర్ గా ఆడాడు. కుడిచేతి వాటం బ్యాటింగ్, కుడిచేతి వేగంగా బౌలర్ గా రాణించాడు.
గతంలో అండర్-15 స్థాయిలో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 2000లో కరాచీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ళ వయసులో పాకిస్థాన్ తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో తన మొదటి వికెట్ తీసుకున్నాడు. 2005 డిసెంబరులో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి వన్డేలో అతనికి అంతర్జాతీయ క్రికెట్‌లో రెండవ అవకాశం ఇవ్వబడింది. 2006 ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన సిరీస్‌లో రిటైన్ చేయబడ్డాడు, కానీ తదుపరి ఇంగ్లాండ్ పర్యటన కోసం వన్డే జట్టు నుండి తప్పించబడ్డాడు.
2007 మార్చిలో షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్ గాయం కారణంగా ఔట్ అయిన తర్వాత 2007 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఇతన్నీ, మహ్మద్ సమీని భర్తీ చేశారు.[2]
2007 డిసెంబరు 8న, బెంగుళూరులో భారత్‌తో జరిగిన సిరీస్‌లోని మూడవ, చివరి టెస్ట్‌లో పాకిస్తాన్ తరపున టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌లో 5 వికెట్లతో సహా 7 వికెట్లు తీయడం ద్వారా తన ఆల్ రౌండ్ ఆటతీరును ప్రదర్శించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేశాడు.[3]
2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 కొరకు పాకిస్తాన్ జట్టులో భాగంగా ఉన్నాడు, కానీ తరువాత అతను స్నాయువు గాయం కారణంగా భర్తీ చేయబడ్డాడు.[4][5][6]
పదవీ విరమణ తర్వాత ఇంగ్లాండ్‌కు వెళ్ళి, శాశ్వత నివాసం తీసుకున్నాడు. జూనియర్ స్థాయిలో జట్లకు శిక్షణ ఇచ్చాడు. 2023లో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ లెవల్ 4 కోచింగ్ కోర్సును పూర్తి చేసిన పాకిస్తాన్ నుండి మొదటి మాజీ టెస్ట్ క్రికెటర్ అయ్యాడు.[7] 2011లో తరువాత 2022లో బౌలింగ్ కన్సల్టెంట్‌గా సర్రే సిసిసి కి శిక్షణ ఇచ్చాడు.[8]