యు ఆర్ రావు ఉపగ్రహ కేంద్రం | |
---|---|
![]() | |
సంస్థ అవలోకనం | |
స్థాపనం | 11 మే 1972 |
అధికార పరిధి | భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ |
ప్రధాన కార్యాలయం | బెంగళూరు |
Parent Agency | ఇస్రో |
వెబ్‌సైటు | |
URSC home page |
UR రావు ఉపగ్రహ కేంద్రం (URSC), భారతీయ ఉపగ్రహాల రూపకల్పన, అభివృద్ధి నిర్మాణం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసిన కేంద్రం. గతంలో దీన్ని ISRO ఉపగ్రహ కేంద్రం అనేవారు. 1972వ సంవత్సరంలో బెంగళూరులోని పీన్యా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్‌లో ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్ (ISSP) పేరుతో దీన్ని స్థాపించారు. [1] మాజీ ISRO ఛైర్మన్, ISAC వ్యవస్థాపక డైరెక్టర్ అయిన డాక్టర్ ఉడిపి రామచంద్రరావు పేరు మీద 2018 ఏప్రిల్ 2 న దీని పేరు UR రావు శాటిలైట్ సెంటర్ (URSC)గా మార్చారు.
బెంగుళూరులోని విమానపురాలో ఉన్న ఈ కేంద్రం తన 100వ ఉపగ్రహాన్ని 2018 జనవరి 12 న [2] తయారు చేసి ప్రయోగించింది. ఈ కేంద్రం తయారు చేసిన ఉపగ్రహాల్లోINSAT, IRS, GSAT కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఉన్నాయి.
URSC గొడుగు కింద ఉన్న సంస్థలలో ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ (LEOS) ప్రయోగశాల, ISRO శాటిలైట్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ISITE) ఉన్నాయి .
M. శంకరన్ URSC ప్రస్తుత డైరెక్టర్. [3]
ఇతర ISRO కేంద్రాల మాదిరిగానే, URSC ను కూడా మ్యాట్రిక్స్ మేనేజ్‌మెంట్ స్ట్రక్చర్ కింద నిర్వహిస్తారు. ఈ కేంద్రంలో కంట్రోల్ అండ్ మిషన్ ఏరియా, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఏరియా, మెకానికల్ సిస్టమ్స్ ఏరియా, రిలయబిలిటీ అండ్ కాంపోనెంట్స్ ఏరియా వంటి అనేక విభాగాలు ఉన్నాయి. ఈ ఏరియాలను మళ్ళీ సమూహాలుగా విభజించారు. ఉదాహరణకు, కంట్రోల్ అండ్ మిషన్ ఏరియాలో కంట్రోల్ సిస్టమ్స్ గ్రూప్, ఫ్లైట్ డైనమిక్స్ గ్రూప్ మొదలైన అనేక గ్రూపులు ఉన్నాయి. సమూహాలను మళ్ళీ విభాగాలుగా విభజించారు. ఉదాహరణకు, కంట్రోల్ సిస్టమ్స్ గ్రూప్‌లో కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ డివిజన్, కంట్రోల్ డైనమిక్స్ అండ్ అనాలిసిస్ డివిజన్ మొదలైన విభాగాలు ఉన్నాయి. ఇది కాకుండా, ప్రాజెక్ట్ ప్లానింగ్, ఎవాల్యుయేషన్ గ్రూప్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ గ్రూప్, స్పేస్ ఏస్ట్రానమీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాలు స్వతంత్రంగా ఉంటాయి. ఇవికాక ఇతర సౌకర్యాలు (థర్మోవాక్ సౌకర్యం మొదలైనవి వంటివి), ప్రాజెక్ట్‌లు (IRS, INSAT, SATNAV మొదలైనవి) కూడా ఉన్నాయి.