వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మొహమ్మద్ యూనిస్ అహ్మద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | జలంధర్, పంజాబ్, భారతదేశం | 1947 అక్టోబరు 20|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి మీడియం ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | సయీద్ అహ్మద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 62) | 1969 అక్టోబరు 24 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1987 మార్చి 4 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 61) | 1987 ఫిబ్రవరి 18 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1987 మార్చి 20 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2017 జూన్ 19 |
మొహమ్మద్ యూనిస్ అహ్మద్ (జననం 1947, అక్టోబరు 20) పాకిస్తానీ మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. 1969 - 1987 మధ్యకాలంలో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1]
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా పాకిస్తాన్ ఎడ్యుకేషన్ బోర్డ్, కరాచీ, లాహోర్, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్, సర్రే (1971లో కౌంటీ ఛాంపియన్‌షిప్ గెలిచిన జట్టులో ఆడడం), వోర్సెస్టర్‌షైర్, గ్లామోర్గాన్, సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.
1958 - 1973 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున ఆడిన సయీద్ అహ్మద్ తమ్ముడు, యూనిస్ తన 14 సంవత్సరాల వయస్సులో 1962 మార్చిలో సౌత్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఎడ్యుకేషన్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[2]
సర్రే తరపున క్రికెట్ ఆడటం ప్రారంభించడానికి యూనిస్ 1695 ఏప్రిల్ లో ఇంగ్లాండ్ చేరుకున్నాడు.[3] కౌంటీ కోసం రెండు నెలల తర్వాత దక్షిణాఫ్రికా టూరింగ్ పార్టీతో తన మొదటి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ని ఆడాడు.[4] 1978 వరకు సర్రేతో ఉన్నాడు. 1971లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న జట్టులో కీలక పాత్ర పోషించాడు. అయితే, క్లబ్ తన ఒప్పందాన్ని పునరుద్ధరించకపోవడంతో సర్రేను విపత్కర పరిస్థితుల్లో విడిచిపెట్టాడు.[5]
యూనిస్ 1969లో న్యూజిలాండ్‌పై రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.[6] అయినప్పటికీ, 1973 చివరలో వర్ణవివక్ష సౌతాఫ్రికాకు డిహెచ్ రాబిన్స్ XI పర్యటనలో పాల్గొన్నందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇతనిని నిషేధించింది. 1979లో నిషేధం రద్దు చేయబడింది,[7] కానీ యూనిస్ 1987 వరకు అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు తిరిగి రాలేదు.[8]