యూరోపియన్ల క్రికెట్ జట్టు

యూరోపియన్ల క్రికెట్ జట్టు, వార్షిక బొంబాయి టోర్నమెంటు, లాహోర్ టోర్నమెంట్లలో పాల్గొన్న భారతీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. బాంబే జింఖానాలో క్రికెట్ ఆడిన బొంబాయిలోని యూరోపియన్ కమ్యూనిటీ సభ్యులు ఈ జట్టును స్థాపించారు.

1877లో రెండు-రోజుల మ్యాచ్‌ ఆడేందుకు పార్సీల క్రికెట్ జట్టు విసిరిన సవాలును యూరోపియన్లు స్వీకరించడంతో బాంబే టోర్నమెంటు మొదలైంది. ఈ సమయంలో, పోటీని ప్రెసిడెన్సీ మ్యాచ్ అని పిలిచేవారు. ఈ జట్టు 1892 నుండి 1948 వరకు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడారు.


మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన యూరోపియన్ క్రికెటర్లతో కూడిన యూరోపియన్ జట్టు కూడా ఉండేది. ఆ జట్టు మద్రాస్ ప్రెసిడెన్సీ మ్యాచ్‌లలో ఆడేది.

ఆటగాళ్ళు

[మార్చు]
  • చూడండి: యూరోపియన్ల క్రికెటర్ల జాబితా (భారతదేశం)

మూలాలు

[మార్చు]
  • వసంత్ రైజీ, ఇండియాస్ హ్యాంబుల్డన్ మెన్, టైబీ ప్రెస్, 1986
  • మిహిర్ బోస్, ఎ హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్, ఆండ్రీ డ్యూచ్, 1990
  • రామచంద్ర గుహ, ఎ కార్నర్ ఆఫ్ ఎ ఫారిన్ ఫీల్డ్ - యాన్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ ఎ బ్రిటీష్ స్పోర్ట్, పికాడార్, 2001