వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | హెరాత్ ముదియన్సెలాగే రంగనా కీర్తి బండార హెరాత్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కురునెగల, శ్రీలంక | 1978 మార్చి 19||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 5 అం. (1.65 మీ.) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 78) | 1999 సెప్టెంబరు 22 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2018 నవంబరు 6 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 120) | 2004 ఏప్రిల్ 25 - జింబాబ్వే తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2015 మార్చి 1 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 14 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 39) | 2011 ఆగస్టు 6 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2016 మార్చి 28 - దక్షిణాఫ్రికా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1996–1998 | Kurunegala Youth Cricket Club | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1998–2010 | Moors Sports Club | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2011 | Wayamba | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009 | సర్రే | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | హాంప్‌షైర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2018 | Tamil Union Cricket and Athletic Club | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | Basnahira Cricket Dundee | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023-09-01 |
హెరాత్ ముదియన్సెలాగే రంగనా కీర్తి బండార హెరాత్ (జననం 1978, మార్చి 19) శ్రీలంక మాజీ క్రికెటర్, మాజీ టెస్ట్ కెప్టెన్.[1] క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో ఆడాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా నిలిచాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుతో స్పిన్ బౌలింగ్ సలహాదారుగా పనిచేస్తున్నాడు.[2] 2014 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
శ్రీలంక తరపున ఒక స్పెషలిస్ట్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, టెస్ట్ మ్యాచ్‌లలో 433 వికెట్లతో లెఫ్టార్మ్ స్పిన్నర్ ద్వారా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను కలిగి ఉన్నాడు. 2017 మార్చి 11న టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా డేనియల్ వెట్టోరిచే 362 వికెట్లను అధిగమించాడు.[3] టెస్టుల్లో 400 వికెట్లు తీసిన తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్ గా నిలిచాడు.[4] 2018 ఫిబ్రవరి 10న బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో వసీం అక్రమ్‌ను అధిగమించి అత్యంత విజయవంతమైన ఎడమచేతి వాటం బౌలర్‌గా నిలిచాడు.[5] 1999 నుండి 2018 వరకు 19 సంవత్సరాలపాటు శ్రీలంక తరపున సుదీర్ఘ టెస్ట్ క్రికెట్ కెరీర్‌ను కలిగి ఉన్నాడు.
2016 మే 29న ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్ తర్వాత టెస్ట్ క్రికెట్ చరిత్రలో 300 వికెట్లు తీసిన మూడో శ్రీలంక బౌలర్‌గా హెరాత్ నిలిచాడు.[6] 2016 నవంబరు 8న టెస్టు ఆడే దేశాలపై ఐదు వికెట్లు తీసిన చరిత్రలో మూడో బౌలర్‌గా హెరాత్ నిలిచాడు.[7] 2017 అక్టోబరు 2న 400 టెస్ట్ వికెట్లు తీసిన రెండవ శ్రీలంక బౌలర్ గా నిలిచాడు. 350, 400 టెస్టు వికెట్లు సాధించిన అతి పెద్ద వయసు ఆటగాడు.
2016 అక్టోబరు 23న జింబాబ్వేలో శ్రీలంక పర్యటనకు హెరాత్‌ను కెప్టెన్‌గా ప్రకటించారు.[8] 1968లో టామ్ గ్రేవెనీ తర్వాత ఏ దేశం నుండి మొదటిసారి టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించిన అతి పెద్ద శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు.[9]
2018 అక్టోబరు 22న ఇంగ్లాండ్‌తో గాలేలో జరిగిన మొదటి టెస్టు తర్వాత హెరాత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.[10] 2018 నవంబరు 6నగాలేలో తన చివరి టెస్టు ఆడాడు.[11][12] మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ను అవుట్ చేయడంతో అదే వేదికపై 100 టెస్ట్ వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు.[13] మ్యాచ్ తర్వాత, హెరాత్ రిటైర్ కావడానికి ఇది "సరైన సమయం" అని చెప్పాడు, తన కెరీర్‌ను 433 టెస్ట్ వికెట్లతో ముగించాడు, ఇది ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్‌కు అత్యధికం.[14]