రంజన | |
---|---|
జననం | రంజనా దేశ్‌ముఖ్ 1955 |
మరణం | 2000, మార్చి 3 |
విద్యాసంస్థ | పరెల్ ఇంగ్లీష్ హైస్కూల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1975–1987 |
తల్లిదండ్రులు | వత్సల దేశముఖ్ |
రంజనా దేశ్‌ముఖ్ (1955 - 2000, మార్చి 3) మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. 1970, 80లలో మరాఠీ సినిమాలలో నటించింది.[1]
రంజన 1955లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. రంజన తల్లి వత్సల దేశముఖ్, పినతల్లి సంధ్య (వి. శాంతారామ్ భార్య) ఇద్దరూ హిందీ సినిమా నటీమణులే.[2]
1975లో వి. శాంతారాం దర్శకత్వం వహించిన చందనాచి చోళి అంగ్ అంగ్ జాలి అనే సినిమా ద్వారా సినిమారంగానికి పరిచయమయింది. ఆ తర్వాత శాంతారాం తీసిన ఝంజ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. 1980లో వచ్చిన అరే సన్సార్ సన్సార్, 1983లో వచ్చిన గప్ చుప్ గప్ చుప్ సినిమాలలో నటనకు రెండుసార్లు ఉత్తమ నటిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది.[3] తరువాతికాలంలో సుశీల, గోంధలత్ గోంధాల్, ముంబయిచా ఫౌజ్దార్, బిన్ కమాచా నవ్రా, ఖిచ్డీ, చానీ, జఖ్మీ వాఘిన్, భుజంగ్, ఏక్ దావ్ భూతచా సినిమాలలో నటించింది.
అశోక్ సరాఫ్, అవినాష్ మసురేకర్, శ్రీరామ్ లాగూ, కుల్దీప్ పవార్, నిలు ఫూలే, రవీంద్ర మహాజని, రాజా గోసావి వంటి అనేకమంది ప్రముఖ మరాఠీ చలనచిత్ర నటులతో కలిసి నటించింది. 1987లో ఝంఝార్ షూటింగ్ కోసం బెంగుళూరుకు వెళుతున్నపుడు జరిగిన కారు ప్రమాదంలో రంజన కాళ్ళు చచ్చుబడిపోవడంతో సినిమారంగానికి దూరమయింది. ప్రమాదం తర్వాత ఆమె ఫక్త్ ఏక్దాచ్ అనే నాటకంలో నటించింది.[4]
రంజన 45 ఏళ్ళ వయసులో 2000, మార్చి 3న సెంట్రల్ ముంబై, పరేల్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించింది.[1]
రంజనకు నివాళిగా జీ టాకీస్ 2011 మార్చి 3న రంజన సినిమాలను ప్రసారం చేసింది.[5] రంజన జ్ఞాపకార్థం మహారాష్ట్ర ప్రభుత్వం ఒక అవార్డును కూడా ఏర్పాటుచేసింది.
पण त्यांच्या मृत्यूच्या काही वर्षं आधी त्यांनी फक्त एकदाच या नाटकात काम केले होते. या नाटकातील त्यांची भूमिका ही त्यांची शेवटची भूमिका ठरली.