రంజిత్ దత్తా | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
ముందు | పల్లబ్ లోచన్ దాస్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | సోనిత్పూర్ | ||
చేనేత, మైనారిటీల సంక్షేమం, జౌళి & సెరికల్చర్ మంత్రి
| |||
పదవీ కాలం 24 మే 2016 – 10 మే 2021 | |||
ముందు | బిస్మితా గొగోయ్ (సెరికల్చర్, చేనేత & జౌళి) చందన్ కుమార్ సర్కార్ (నీటిపారుదల) సర్బానంద సోనోవాల్ (మైనారిటీల సంక్షేమం) | ||
తరువాత | ఉర్ఖావో గ్వ్రా బ్రహ్మ (సెరికల్చర్, హ్యాండ్లూమ్ & టెక్స్టైల్స్) భబేష్ కలిత (నీటిపారుదల) చంద్ర మోహన్ పటోవారీ (మైనారిటీల సంక్షేమం) | ||
పదవీ కాలం 2010 – 2012 | |||
తరువాత | సర్బానంద సోనోవాల్ | ||
శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 19 మే 2016 | |||
ముందు | పల్లబ్ లోచన్ దాస్ | ||
నియోజకవర్గం | బెహాలీ | ||
పదవీ కాలం 2001 – 2011 | |||
తరువాత | పల్లబ్ లోచన్ దాస్ | ||
నియోజకవర్గం | బెహాలీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హతిబోంధా, బిస్వనాథ్ జిల్లా, అస్సాం | 1957 జనవరి 24||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | కులధర్ దత్తా లాబణ్య దత్తా | ||
జీవిత భాగస్వామి |
గీతా దత్తా (m. 1991) | ||
పూర్వ విద్యార్థి | దర్రాంగ్ కళాశాల |
రంజిత్ దత్తా (జననం 1957 జనవరి 24) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన నాలుగుసార్లు అస్సాం శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఆ తరువాత 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో సోనిత్పూర్ లోక్సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
దత్తా 2001 అస్సాం శాసనసభ ఎన్నికలలో బెహాలీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బర్నాబాష్ తంతిపై 13529 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
2006 అస్సాం శాసనసభ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై 8979 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
2011 అస్సాం శాసనసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పల్లబ్ లోచన్ దాస్ చేతిలో 18136 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
2016 అస్సాం శాసనసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రూపక్ శర్మపై 23601 ఓట్ల తేడాతో మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
సర్బానంద సోనోవాల్ మంత్రివర్గంలో చేనేత, మైనారిటీల సంక్షేమం, జౌళి & సెరికల్చర్ మంత్రిగా 2016 మే 24న గౌహతిలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[5][6][7]
2021 అస్సాం శాసనసభ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి జయంత బోరాపై 29839 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.