రజనీ బసుమతరీ | |
---|---|
![]() | |
వృత్తి | సినిమా నటి, దర్శకురాలు, నిర్మాత, రచయిత్రి |
క్రియాశీల సంవత్సరాలు | 2004—ప్రస్తుతం |
రజనీ బసుమతరీ, సినిమా నటి, దర్శకురాలు, నిర్మాత, రచయిత్రి. 2014లో వచ్చిన మేరీ కోమ్ అనే హిందీ సినిమాలో మేరీ కోమ్ తల్లి (మంగ్తే అఖమ్ కోమ్) పాత్రలో నటించి గుర్తింపు పొందింది.[1][2][3] అనురాగ్ సినిమా వ్రాసి, నిర్మించింది. రజనీ దర్శకత్వం వహించిన తొలిచిత్రం రాగ్ (2014) సినిమా [4] అన్ని ప్రధాన నగరాల్లో విడుదలైంది. 2019లో జ్వ్లవి - ది సీడ్ అనే సినిమాకు దర్శకత్వం వహించింది.[5][6]
రజనీ, అసోం రాష్ట్రం, రంగపరా పట్టణంలోని బోరో కుటుంబంలో జన్మించింది.[7][8] రజనీ, గౌహతి విశ్వవిద్యాలయ పరిధిలోని హండిక్ గర్ల్స్ కాలేజీ నుండి అస్సామీ సాహిత్యంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అందుకుంది.[9]
1995లో, రజనీ ఢిల్లీకి వెళ్లి కార్పోరేట్ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో తన సినీ ప్రారంభించింది. 2004లో, అనురాగ్ (ఒక అస్సామీ భాషా రొమాంటిక్ డ్రామా సినిమా) కు స్క్రీన్‌ప్లేను రాసి, నిర్మించింది. బిద్యుత్ చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ సహాయక పాత్రలో కూడా నటించింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు, ఉత్తమ దర్శకుడు వంటి అనేక అస్సాం రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది.
మేరీ కోమ్, ది షాకీన్స్ వంటి బాలీవుడ్ చిత్రాలతోపాటు షటిల్ కాక్ బాయ్స్, III స్మోకింగ్ బారెల్స్ వంటి సినిమాలలో చిన్న పాత్రలలో నటించింది.
మేరీకోమ్ సినిమాలో మేరీకోమ్ తల్లిగా నటించడంతో మంచి గుర్తింపు వచ్చింది. రజనీ తొలిసారిగా దర్శకత్వం వహించిన అస్సామీ సినిమా రాగ్ 2014లోవిడుదలయింది. ఈ సినిమా ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ నటి (వాహిద్), ఉత్తమ నటుడు (ఆదిల్ హుస్సేన్) ఉత్తమ సహాయ నటుడు (కెన్నీ బాసుమతరీ) వంటి విభాగాలతోసహా 14 విభాగాల్లో ప్రాగ్ సినీ అవార్డులకు నామినేట్ అయింది. చివరకు హుస్సేన్‌కి ఉత్తమ నటుడు పురస్కారం లభించింది.
2019లో, రజనీ దర్శకత్వం వహించిన రెండవ చలనచిత్రం జ్వ్లవి - ది సీడ్ విడుదలయింది.[10][11] ఈ సినిమా బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం, [12] చెన్నై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం, గౌహతి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం, కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం, పూణే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది.[13] గౌహతి[14]లో దర్శకత్వం వహించినందుకు రజనీ ప్రత్యేక జ్యూరీ అవార్డును, ఆ సినిమాకి బెంగళూరులో ప్రత్యేక జ్యూరీ మెన్షన్ అవార్డును అందుకుంది.[15] 4వ శైలధర్ బారువా మెమోరియల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో రజనీ ఉత్తమ స్క్రీన్ రైటర్ అవార్డును కూడా అందుకుంది.[16]
సంవత్సరం | సినిమా | దర్శకుడు | నటుడు | స్క్రీన్ ప్లే | నిర్మాత | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|---|---|
2004 | అనురాగ్ | Yes | Yes | Yes | [17] | ||
2011 | షటిల్ కాక్ బాయ్స్ | Yes | [18] | ||||
2014 | రాగ్ | Yes | Yes | Yes | అతిథి పాత్ర ప్రాగ్ సినీ అవార్డ్స్ 2014కి నామినేట్ చేయబడింది - ఉత్తమ దర్శకుడు ప్రాగ్ సినీ అవార్డ్స్ 2014కి నామినేట్ చేయబడింది - ఉత్తమ స్క్రీన్ ప్లే |
[17] | |
2014 | మేరీ కోమ్ | Yes | [1] | ||||
2014 | ది షాకీన్స్ | Yes | [19] | ||||
2017 | III స్మోకింగ్ బారెల్స్ | Yes | [20] | ||||
2019 | జ్వ్లవి - ది సీడ్ | Yes | Yes | Yes | Yes | ప్రాగ్ సినీ అవార్డుల విజేత - ఉత్తమ చిత్రం (అస్సామీ కాకుండా) [16] సాయిలాధర్ బారువా మెమోరియల్ ఫిల్మ్ అవార్డుల విజేత - ఉత్తమ స్క్రీన్ రైటర్[16] గౌహతి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేత - ప్రత్యేక జ్యూరీ అవార్డు[14] బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవ విజేత - ప్రత్యేక జ్యూరీ మెన్షన్[15] |
[21] |
2022 | గుడ్ బై | Yes | అమితాబ్ బచ్చన్ నటించిన వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు | ||||
2022 | రానా నాయుడు | Yes | పోస్ట్ ప్రొడక్షన్ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ |
||||
2023 | గోరై ఫఖ్రీ | Yes | Yes | Yes |