రమా | |
---|---|
జననం | శాంతి పుదుక్కోట్టై, తమిళనాడు |
క్రియాశీల సంవత్సరాలు | 1990 2010-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | వెంకటేష్ (m. 1991–ప్రస్తుతం) |
పిల్లలు | 2 |
బంధువులు | విజుత్తుగల్ సీరియల్ లత (చెల్లెలు) |
రమా 1990లలో తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేసిన భారతీయ నటి. 1991లో పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం మానేసి భర్త వెంకటేష్, ఇద్దరు కొడుకులతో సెటిల్ అయింది. అయితే ఆమె 2010 చిత్రం అవల్ పెయార్ తమిజరాసిలో తల్లి పాత్రతో చలనచిత్రరంగంలో తిరిగి అడుగుపెట్టింది.
దర్శకుడు భారతిరాజా సినిమా ఎన్ ఉయిర్ తోజన్ (1990)లో ఆమె నటించింది.[1] [2]
పా. రంజిత్ చిత్రం మద్రాస్ (2014)లో కార్తీకి తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె 2010లో పెయార్ తమిళరాసిలో తల్లి పాత్రను పోషించింది. ఆమె ఏఆర్ మురుగదాస్ కత్తి (2014)లో కూడా నటించింది, అక్కడ ఆమె విజయ్ తల్లిగా నటించింది. పురంపోక్కు ఎంగిర పొదువుడమై (2015)లోనూ ఆమె నటించింది. ఆమె కలైంజర్ టీవీలో ప్రసారమైన భారతీరాజా అప్పనుమ్ అత్తాళం వంటి టెలివిజన్ ధారావాహికలలో, సన్ టీవీలో ప్రసారమయిన అవలుం పెన్ తానే , కనవారుకాగా అనే సీరియల్స్‌లలో కూడా నటించింది.[2]
రమ 1991లో వెంకటేష్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.